Share News

AP Assembly: అబద్దాలు వినలేకపోతున్నాం.. టీడీపీ సభ్యుల వాకౌట్

ABN , Publish Date - Feb 05 , 2024 | 11:29 AM

Andhrapradesh: ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అబద్దాలు వినలేకపోతున్నామంటూ టీడీపీ సభ్యులు సమావేశాల నుంచి బయటకు వచ్చేశారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం మొదలైనప్పటి నుంచి పలు అంశాలపై టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలుపుతూనే ఉన్నారు.

AP Assembly: అబద్దాలు వినలేకపోతున్నాం.. టీడీపీ సభ్యుల వాకౌట్

అమరావతి, ఫిబ్రవరి 5: ఏపీ అసెంబ్లీలో (AP Assembly Session) గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే టీడీపీ సభ్యులు (TDP MLAs) సభ నుంచి వాకౌట్ చేశారు. అబద్దాలు వినలేకపోతున్నామంటూ టీడీపీ సభ్యులు సమావేశాల నుంచి బయటకు వచ్చేశారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం మొదలైనప్పటి నుంచి పలు అంశాలపై టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలుపుతూనే ఉన్నారు. ముందుగా జగనన్న విద్యా దీవెన క్రింద పూర్తి రీయింబర్స్‌‌మెంట్ ఇచ్చామని గవర్నర్ చెప్పగా.. పూర్తి రీయింబర్స్‌మెంట్ అంతా అబద్దమంటూ తెలుగుదేశం సభ్యులు నిరసన తెలిపారు.

ఆపై మెగా డీఎస్సీ.. దగా డీఎస్సీ అని, ఈ ప్రభుత్వం రైతలకు అన్యాయం చేసిందంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అలాగే అంగన్వాడీలకు అన్యాయం చేశారంటూ నినదించారు. అన్నీ అబద్దాలు... అసత్యాలు సార్ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని చివరిలో టీడీపీ సభ్యులు బహిష్కరించారు. అబద్ధాలు వినలేకపోతున్నామని తెలుగుదేశం ఎమ్మెల్యేలు చెప్పారు. సభ నుంచి వాకౌట్ చేసిన టీడీపీ సభ్యులు.. అసెంబ్లీ లాబీల్లో నినాదాలు చేశారు. గవర్నర్ వెళ్లే దారిలో భైఠాయించే ప్రయత్నం చేయగా.. వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. లాబీల్లో కూడా లాఠీఛార్జ్ చేస్తారా..? అంటూ టీడీఎల్పీ విప్ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.


దద్దరిల్లిన అసెంబ్లీ..

కాగా.. టీడీపీ, వైసీపీ సభ్యుల పోటాపోటీ నినాదాలతో అసెంబ్లీ దద్దరిల్లింది. టీడీపీ సభ్యులకు పోటీగా జై జగన్ అంటూ వైసీపీ సభ్యులు సైతం నినాదాలు చేశారు. వెంటనే బై బై జగన్ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేయగా.. ఒక్కసారిగా అసెంబ్లీలో వాతావరణం మారిపోయింది. దిశా చట్టం ఎక్కడ అంటూ టీడీపీ సభ్యులు కేకలు వేశారు. పేదలందరికీ ఇళ్లు అంతా బోగస్ అంటూ టీడీపీ సభ్యులు స్లోగన్లు వినిపించారు. పేదలందరికీ 10 రూపాయలు ఇస్తున్నారని.. రూ.100 రూపాయలు లాక్కొంటున్నారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. టీడీపీ సభ్యులకు పోటీగా జై జగన్ అంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 05 , 2024 | 11:46 AM