Share News

Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి ఘోర పరాభవం

ABN , Publish Date - Jan 27 , 2024 | 08:44 AM

వెంకటగిరి వైసీపీలో గందరగోళం చోటు చేసుకుంది. ఎంపీ విజయసాయి రెడ్డికి ఘోరపరాభవం ఎదురైంది. వెంకటగిరి వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని పలు వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి ఘోర పరాభవం

నెల్లూరు: వెంకటగిరి వైసీపీలో గందరగోళం చోటు చేసుకుంది. ఎంపీ విజయసాయి రెడ్డికి ఘోరపరాభవం ఎదురైంది. వెంకటగిరి వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని పలు వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాడేపల్లిలో వ్యతిరేకవర్గాలు, నేదురుమల్లితో ఎంపీ విజయసాయిరెడ్డి సమాలోచనలు చేశారు. రాంకుమార్ రెడ్డి గెలుపు కోసం అందరూ పనిచేయాల్సిందే అని విజయసాయి హుకుం జారీ చేశారు.

అలా చేయకుంటే పార్టీ పరంగా చర్యలు తప్పవని సదరు నేతలకు విజయసాయిరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. నేదురుమల్లి తమని ఇబ్బందులు పెట్టారని విజయసాయికి పలువురు నేతలు తెలిపారు. ఈ క్రమంలోనే పలు అంశాలపై నేదురుమల్లి, విజయసాయిని నిలదీశారు. నేదురుమల్లి కోసం పనిచేసేది లేదని తెగేసి చెప్పారు. అవసరమైతే వైసీపీని వీడేందుకు సైతం నేదురుమల్లి వ్యతిరేక వర్గాలు సిద్ధమవుతున్నాయి.

Updated Date - Jan 27 , 2024 | 08:44 AM