Share News

Varla Ramaiah: పోలీసు ఆత్మహత్యలకు జగనే కారణం: వర్ల

ABN , Publish Date - Apr 12 , 2024 | 08:33 AM

కొంతమంది పోలీసు అధికారులు జగన్‌కు తొత్తులుగా పనిచేయడం వల్ల కిందిస్థాయి పోలీసు సిబ్బంది ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) ఆరోపించారు.

Varla Ramaiah: పోలీసు ఆత్మహత్యలకు జగనే కారణం: వర్ల

అమరావతి, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): కొంతమంది పోలీసు అధికారులు జగన్‌కు తొత్తులుగా పనిచేయడం వల్ల కిందిస్థాయి పోలీసు సిబ్బంది ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) ఆరోపించారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘చేతకాని ముఖ్యమంత్రికి తొత్తుగా మారిన డీజీపీతో పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులకు రావాల్సిన సరెండర్‌ లీవ్స్‌, అడిషనల్‌ లీవ్స్‌, టీఏ, డీఏలను ఎందుకివ్వడం లేదో చెప్పాలి. అప్పుల బాధలు తాళలేక శంకర్రావు చనిపోవడానికి జగనే కారణం’ అని వర్ల స్పష్టం చేశారు.

Updated Date - Apr 12 , 2024 | 08:33 AM