Share News

Mohammed Shariff: ఆ చీకటి వ్యవహారం నిజం కాదా.. మంత్రి బొత్సకు టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్

ABN , Publish Date - Mar 11 , 2024 | 10:45 PM

తన రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) చేసిన వ్యాఖ్యలకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మహమ్మద్ షరీఫ్ (Mohammed Shariff) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఎప్పుడూ రాష్ట్రాభివృద్ధి, ప్రజల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొనే పొత్తులు పెట్టుకున్నారే తప్ప.. సీఎం జగన్‌లా (CM YS Jagan) వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని అన్నారు.

Mohammed Shariff: ఆ చీకటి వ్యవహారం నిజం కాదా.. మంత్రి బొత్సకు టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్

తన రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) చేసిన వ్యాఖ్యలకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మహమ్మద్ షరీఫ్ (Mohammed Shariff) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఎప్పుడూ రాష్ట్రాభివృద్ధి, ప్రజల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొనే పొత్తులు పెట్టుకున్నారే తప్ప.. సీఎం జగన్‌లా (CM YS Jagan) వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని అన్నారు. జగన్ అవినీతి, దోపిడీతో నాశనమైన ఆంధ్రరాష్ట్రాన్ని, రోడ్లపాలైన ప్రజల్ని ఆదుకోవడానికే.. చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్న నిజాన్ని ప్రజలు గ్రహించారన్నారు.


మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి మరణానికి జగన్ రెడ్డే కారణమని.. తండ్రి చావు వెనుక కొడుకు హస్తముందని చెప్పింది నువ్వు కాదా బొత్సా? అని మహమ్మద్ షరీఫ్ నిలదీశారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఆనాడు స్వప్రయోజనాల కోసం జగన్‌ను, ఆయన తల్లి విజయమ్మను అనరాని మాటలనడం.. ఎలాంటి నైతికతో చెప్పాలని బొత్సకు డిమాండ్ చేశారు. బాబాయ్ హత్య కేసు తన మెడకు చుట్టుకోకుండా ఉండేందుకు.. బీజేపీతో జగన్ చీకటి వ్యవహారాలు నడిపింది నిజం కాదా? అని ప్రశ్నించారు. తనపై ఉన్న అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు, బెయిల్ రద్దు కాకుండా ఉండేందుకు జగన్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తడం నిజం కాదా? అని అడిగారు. బీజేపీని బూచిగా చూపి.. టీడీపీకి మైనారిటీలను దూరం చేయాలనే కుతంత్రంతోనే బొత్స మాట్లాడారని విమర్శలు గుప్పించారు. ఐదేళ్లలో కుటుంబాలతో సహా మైనారిటీలను బలితీసుకున్న జగన్ రెడ్డిని నమ్మి, మరోసారి మోసపోవడానికి ముస్లిం సమాజం సిద్ధంగా లేదని తేల్చి చెప్పారు.

టీడీపీ ఎప్పుడూ తెలుగువారి ఆత్మగౌరవం.. ఆత్మవిశ్వాసం కోసమే పని చేసింది తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని మహమ్మద్ షరీఫ్ స్పష్టం చేశారు. టీడీపీ పొత్తులు తప్పో, ఒప్పో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. జగన్ రెడ్డి, బొత్స లాంటి స్వార్థపరులు మైనారిటీలను తప్పుదోవ పట్టించడానికి ఎన్ని వేషాలేసినా ఉపయోగం లేదని ఉద్ఘాటించారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పడు.. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ అబ్దుల్ కలామ్‌ను రాష్ట్రపతిని చేసిందని గుర్తు చేశారు. గతంలో మోదీ ప్రభుత్వంతో కలిసి విభజనానంతర రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ పని చేసిందని చెప్పుకొచ్చారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 11 , 2024 | 10:45 PM