Share News

SIPC Meeting : ఎస్‌ఐపీబీకి టీసీఎస్‌, రిలయన్స్‌ ప్రతిపాదనలు

ABN , Publish Date - Dec 24 , 2024 | 05:59 AM

రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ) సమావేశం సోమవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగింది.

SIPC Meeting : ఎస్‌ఐపీబీకి టీసీఎస్‌, రిలయన్స్‌ ప్రతిపాదనలు

  • సీఎస్‌ అధ్యక్షతన ఎస్‌ఐపీసీ సమావేశంలో నిర్ణయం

అమరావతి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ) సమావేశం సోమవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన వివిధ కంపెనీలు, సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై కమిటీ చర్చించి తదుపరి ఆమోదం నిమిత్తం స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ)కి సిఫార్సు చేసింది. ఈ సందర్భంగా సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ట్రాకర్‌ అంశాన్ని అధికారులతో సమీక్షించారు. అదే విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉపాధి కల్పనా యూనిట్లను పర్యవేక్షించాల్సిందిగా ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో సంబంధిత శాఖాధిపతుల సహాయంతో జీఎం డీఐసీ, రాష్ట్ర స్థాయిలో శాఖాధిపతులు యూనిట్ల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. 2 వేల మందికి ఉపాధి కల్పిచే యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి టీసీఎస్‌ చేసిన ప్రతిపాదనను, రూ.65 వేల కోట్లతో వివిధ జిల్లాల్లో 500 యూనిట్లు ఏర్పాటుకు రిలయన్స్‌ చేసిన ప్రతిపాదనను ఎస్‌ఐపీబీకు సిఫార్సు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 05:59 AM