Share News

Ram Mohan Naidu: బీసీ సబ్-ప్లాన్ నిధుల్ని మళ్లించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి

ABN , Publish Date - Mar 05 , 2024 | 09:03 PM

మంగళగిరిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభలో (BC Declaration Event) ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (CM YS Jagan Mohan Reddy) టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ పాలనలో అత్యధికంగా నష్టపోయింది బీసీలేనని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. రూ. 74 వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ (BC Subplan) నిధుల్ని మళ్లించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అని ఆరోపణలు గుప్పించారు.

Ram Mohan Naidu: బీసీ సబ్-ప్లాన్ నిధుల్ని మళ్లించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి

మంగళగిరిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభలో (BC Declaration Event) ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (CM YS Jagan Mohan Reddy) టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ పాలనలో అత్యధికంగా నష్టపోయింది బీసీలేనని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. రూ. 74 వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ (BC Subplan) నిధుల్ని మళ్లించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అని ఆరోపణలు గుప్పించారు. బీసీలంతా జగన్‌ను గద్దె దించేందుకు నడుం బిగించి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బీసీ కార్పోరేషన్ల టీకి కూడా డబ్బులు లేవని, అలాంటి కార్పోరేషన్లు ఉంటే ఎంత లేకపోతే ఎంత అని తూర్పారపట్టారు.


వైసీపీ హయాంలో లోక్‌సభలో ప్యానెల్ స్పీకర్ మిథున్ రెడ్డి, రాజ్యసభలో విజయసాయిరెడ్డిలను నియమించారని.. కానీ దళితుడు జీఎంసీ బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌గా చేసిన ఘనత ఒక్క టీడీపీదేనని రామ్మోహన్ గుర్తు చేశారు. అలాగే.. బీసీ ముద్దుబిడ్డ ఎర్రన్నాయుడిని (Yerrannaidu) కేంద్రమంత్రిగా చేసిన ఘనత చంద్రబాబుది అని చెప్పారు. రూ. 3700 కోట్లతో కార్పోరేషన్ల ద్వారా బీసీలకు చంద్రబాబు రుణాలిచ్చారన్నారు. దేశంలో ప్రతిరోజు బీసీలు కష్టపడితేనే దేశం ముందుకు సాగుతుందని.. బట్టలు శుభ్రపర్చాలన్నా, జుట్టు సరిచేయాలన్నా, గుడి తలుపులు తెరవాలన్నా బీసీలేనని చెప్పారు. స్వాతంత్రం వచ్చాక బీసీలు ఎంతోమందివి పల్లకీలు మోశారని.. కానీ ఎన్టీఆర్ (NTR) పార్టీ స్థాపించి బీసీలను పల్లకి ఎక్కించారని అన్నారు. బీసీలను చట్ట సభలకు పంపిన ఘనత ఎన్టీఆర్‌దే చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనను బీసీలు గెలిపించాలని కోరారు.

ఇదే సమయంలో జనసేన జిల్లా నాయకులు చెల్లుబోయిన వంశీకృష్ణ యాదవ్ (Chelluboina Vamsi Krishna Yadav) మాట్లాడుతూ.. వైసీపీలో బీసీలకు విలువ లేదు, అందుకే ఆ పార్టీని వీడుతున్నారని విమర్శించారు. బీసీ మంత్రులను జగన్ రెడ్డి డమ్మీలుగా చేశారని దుయ్యబట్టారు. 56 కార్పోరేషన్లు అన్నారని.. మరి ఒక్క రూపాయి నిధులైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. బీసీలకు పూర్వ వైభవం రావాలంటే.. వైసీపీని బంగాళఖాతంలో కలిపి.. టీడీపీ, జనసేనను గెలిపించాలని పిలుపునిచ్చారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 05 , 2024 | 09:03 PM