Share News

తిరుమలలో ‘స్మరామి..స్మరామి’, శ్రీశైలంలో ‘శంకర ... శంకర’

ABN , Publish Date - Apr 04 , 2024 | 11:54 PM

పురాణపండ శ్రీనివాస్ ‘శంకర శంకర’ గ్రంధం శ్రీశైలంలో , తిరుమలలో ‘స్మరామి స్మరామి’ గ్రంధం భక్తలోకాన్ని విస్మయింపచేసిందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అన్నారు.

తిరుమలలో ‘స్మరామి..స్మరామి’, శ్రీశైలంలో ‘శంకర ... శంకర’

శ్రీశైలం, ఏప్రిల్ 4: వాస్తవాలు, కఠోర సత్యాలు మాట్లాడుకోవాలంటే... వెయ్యి పార్శ్వాల్లోంచి చూచినా తెలుగునాట ఒక కవితా సంకలనమో, సాహిత్య గ్రంధమో, ఏదో ఒక అంశానికి చెందిన పుస్తకమో ముద్రించి బయట ప్రపంచానికి అందించాలంటే చాలా చాలా కష్టపడాలని, ఇది ఒక యజ్ఞంలాంటిదని ఆనాటి మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాధ సత్యనారాయణ మొదలు ఈనాటి మహామహులైన సాహిత్య వేత్తల వరకూ నూటికి తొంభై ఐదు శాతం మేధోసమాజం వరకూ గొంతెత్తిచెప్పే నిప్పులాంటి నిజం. ఈ కోణం లోంచి చూసినప్పుడు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో లక్షలమందిని ఆశ్చర్యచకితుల్ని చేస్తున్న ఒక అద్భుతమే, అసాధారణ అవిశ్రాన్త పుస్తకమాంత్రికుడు, రచయిత పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనాలు అందిస్తున్న తీరు అహో.. అనిపిస్తోందంటున్నారు కొందరు పీఠాధిపతులు, మఠాధిపతులు, ప్రచురణకర్తలు, సాహిత్యసంస్థల ప్రతినిధులు, ఆధ్యాత్మిక సమాజాల నిర్వాహకులు. కార్యసాధన కోసం, శాంతియుత సౌఖ్యప్రద జీవనంకోసం ఒక మేలిమి వ్యాపకంగా ఒకింత ధైర్యంగా, ఒక పవిత్ర నమ్మకంగా పురాణపండ శ్రీనివాస్ అద్భుత వ్యాఖ్యాన వైఖరీ దక్షతతో అందుతున్న పుస్తకాలు వేల భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయని తెలుగు రాష్ట్రాలలో అనేకమంది ఆలయాల పండిత, అర్చక సమాజాలు అభినందనలు వర్షిస్తున్నాయి.

ఒక పుస్తకం వెనుకనే మరొక అద్భుతమైన గ్రంధం, ఇంకొక అపురూప గ్రంధం.. ఇలా వస్తూనే వున్నాయి. ఏ మహోదాత్త సంకల్పంతో ‘జ్ఞానమహాయజ్ఞ కేంద్రం’ సంస్థను పురాణపండ శ్రీనివాస్ స్థాపించారోగానీ... గోదావరి జిల్లాలు మొదలు... ఎన్నెన్ని జిల్లాలలో వేలకొలది ఆలయాలకు, మఠాలకు, పీఠాలకు, వందల గ్రంథాలయాలకు ఈ అద్భుతగ్రంధాలు ఉచితంగా చేరడం, చేర్చడం ఈ సంస్థ నిస్వార్ధ యజ్ఞానికి ప్రబల నిదర్శనంగా చెప్పక తప్పదంటున్నారు. ఇప్పటికి వందకు పైగా దైవీయ స్పృహకలిగిన అపూర్వ గ్రంధాలు రచించి, సంకలనీకరించి విశేషంగా భక్త రసజ్ఞ లోకాన్ని పరవశింపచేస్తూ ఆకర్షిస్తున్న పురాణపండ శ్రీనివాస్ ఇప్పుడు శైవ, వైష్ణవ ప్రపంచాల కోసం ప్రత్యేకంగా ఆవిష్కరించిన ‘స్మరామి... స్మరామి’, ‘శంకర ... శంకర’ మంత్రభరిత సమ్మోహన గ్రంధాలు సరికొత్తగా ముస్తాబై, ఎప్పటిలా పూర్తిగా నాణ్యతా ప్రమాణాలతో, జపాన్ ఆర్ట్ పేపర్‌పై ముద్రించి గుండెకీ, మనసుకీ వెంటనే హత్తుకునేలా... ఎంచక్కగా... పవిత్ర సొగసుల సౌందర్యపు భాషలో అందించడంతో ఇటు శ్రీశైలం, అటు తిరుమల పుణ్య క్షేత్రాల్లో ఈ బుక్స్ పట్ల చూపుతున్న ఆదరణ అనూహ్యమని రామకృష్ణ మఠ్, తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం ప్రచురణ సంస్థల ప్రచురణకర్తలు సైతం ప్రశంసలు వర్షిస్తున్నాయి.

Smaraami.jpg

కంటెంట్ మరియు కటౌట్ మరియు కఠోర పరిశ్రమ మరియు కల్మషంలేని మనస్సు మరియు స్వయంప్రతిభ మరియు అన్వేషణాత్మక దృక్పధం మరియు పదిమందికీ మేలు చేసే గుణాలే పురాణపండ శ్రీనివాస్ చేత ఇన్ని అద్భుతాలు చేయిస్తున్నాయని పలువురు న్యాయమూర్తులు సైతం పురాణపండ గ్రంధాలను ఆవిష్కరించడం కనిపిస్తోంది. గత వారం రోజులుగా శ్రీశైలంలో ‘శంకర శంకర’ గ్రంధం, తిరుమలలో ‘స్మరామి స్మరామి’ గ్రంధం భక్తలోకాన్ని విస్మయింపచేసిందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా బాహాటంగా చెప్పడం ప్రత్యక్షంగా కనిపించడం మరొక ఆశ్చర్యకరమైన విషయంగానే పేర్కొనాలి. తన కార్యాలయానికి విచ్చేసిన ప్రముఖులకు కూడా కరుణాకర్ రెడ్డి స్వయంగా కొన్ని పురాణపండ గ్రంధాలను పంచారు కూడా!

ఈ రెండు అపూర్వ గ్రంధాలు త్వరలో తెలుగు రాష్ట్రాల్లో వేలకొలది ఆలయాలకు చేర్చనున్నట్లు సుప్రసిద్ధ ఆధ్యాత్మిక సంస్థ ‘జ్ఞాన మహా యజ్ఞ కేంద్రం’ ప్రకటించడం పట్ల కొన్ని చోట్ల వేదం పాఠశాలలు హర్షం ప్రకటించడం దైవబలంకాకమరేమిటంటున్నారు విజ్ఞులు. ఇదిలా ఉండగా గత పదహారు సంవత్సరాల్లో పురాణపండ శ్రీనివాస్ ఐదు అపురూప గ్రంధాలను... వేర్వేరు సందర్భాల్లో తెలుగునాట చంద్రబాబు నాయుడు, వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య , కే.చంద్రశేఖర్ రావు, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి.. ఐదుగురు ముఖ్యమంత్రులూ ఆవిష్కరించడం ప్రత్యేక విశేషంగా పేర్కొనాలి.

Updated Date - Apr 04 , 2024 | 11:57 PM