Share News

CM Jagan: వెలిగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేయడం సంతోషంగా ఉంది

ABN , Publish Date - Mar 06 , 2024 | 02:08 PM

ప్రకాశం జిల్లా: ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ఫ్లోరైడ్ పీడిత బాధితులకు నీరు అందించే ప్రాజెక్టు వెలుగొండ అని, వైఎస్ రాజశేఖరరెడ్డి వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారని, వెలుగొండ ప్రాజెక్టు రెండు సొరంగాలు రాజశేఖరరెడ్డి కొడుకుగా పూర్తి చేసి జాతికి అంకితం చేయడం సంతోషంగా ఉందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

 CM Jagan:  వెలిగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేయడం సంతోషంగా ఉంది

ప్రకాశం జిల్లా: ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ఫ్లోరైడ్ (Fluoride) పీడిత బాధితులకు నీరు అందించే ప్రాజెక్టు వెలిగొండ (Veligonda Project) అని, వైఎస్ రాజశేఖరరెడ్డి (YSR) వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారని, వెలిగొండ ప్రాజెక్టు రెండు సొరంగాలు రాజశేఖరరెడ్డి కొడుకుగా పూర్తి చేసి జాతికి అంకితం చేయడం సంతోషంగా ఉందని సీఎం జగన్ (CM Jagan) వ్యాఖ్యానించారు. బుధవారం ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన వెలిగొండ ప్రాజెక్టు వద్ద పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. 30 మండలాల్లో 15.25 లక్షల మందికి తాగు నీరు, 4.45 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. వచ్చే ఖరీఫ్‌లో నల్లమల సాగర్‌కు నీరు తీసుకువస్తామన్నారు. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం రూ. 1200 కోట్లు ఖర్చు చేసి నీరు నింపుతామన్నారు.

మళ్ళీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తామని, ఎర్రగొండపాలెం, దర్శి, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం నియోజక వర్గాలకు మేలు జరుగుతుందని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వంలో వెలిగొండ పనులు నత్తనడకన జరిగాయని, వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చిన తరువాత వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేశామన్నారు.

కాగా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే సిఎం జగన్ జాతికి అంకితం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తానని జగన్ చెప్పారు. కానీ ఇంతవరకు ప్రాజెక్టుపూర్తి కాలేదు. గత టీడీపీ ( TDP) ప్రభుత్వంలో 80 శాతం వెలిగొండ ప్రాజెక్టు పనులను పూర్తి చేయడం జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్ల 10 నెలల్లో రెండున్నర కిలో మీటర్ల పాటు జగన్ సొరంగం పనులు చేశారు. రెండో సొరంగంలో లైనింగ్ పనులు కూడా పూర్తి చేయలేదు. 11 ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం అందలేదు. కాలువల నిర్మాణం కూడా జరగలేదు. పనులు పూర్తి కాకుండానే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేశామంటూ ఈ రోజు జగన్ పైలాన్ ఆవిష్కరించారు. జగన్ తీరుపై ప్రజలు, నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 06 , 2024 | 02:08 PM