Share News

AP Politics: మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగేది ఆయనే.. పేర్నినాని కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 07 , 2024 | 10:32 PM

మచిలీపట్నం వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా సింహాద్రి చంద్ర శేఖ‌ర్‌ ( Simhadri Chandra Shekhar) ని సీఎం జగన్ రెడ్డి నిర్ణయించారని మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) తెలిపారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... సింహాద్రి చంద్రశేకర్ తండ్రి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని చెప్పారు. మచిలీపట్నంతో చంద్ర శేఖ‌ర్‌కు వారి కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉందన్నారు.

AP Politics: మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగేది ఆయనే.. పేర్నినాని కీలక వ్యాఖ్యలు
Perni Nani

అమరావతి: మచిలీపట్నం వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా సింహాద్రి చంద్ర శేఖ‌ర్‌ ( Simhadri Chandra Shekhar) ని సీఎం జగన్ రెడ్డి నిర్ణయించారని మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) తెలిపారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... సింహాద్రి చంద్రశేకర్ తండ్రి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని చెప్పారు. మచిలీపట్నంతో చంద్ర శేఖ‌ర్‌కు వారి కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉందన్నారు. 35 ఏళ్లుగా అంకాలజీ వైద్యుడిగా ఆయన సేవలు అందిస్తున్నారని చెప్పారు. రాజకీయ బేధాలు, వైరుధ్యాలు లేకుండా ప్రజలకు వైద్య సేవలు అందించారని తెలిపారు. మచిలీపట్నం పార్లమెంట్ ప్రజలకు సేవ చేసేందుకు ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారని తెలిపారు. వైసీపీ క్యాడర్‌కు ఉత్సాహం వచ్చేలా సీఎం జగన్ చంద్ర శేఖ‌ర్‌ని నియమించారని చెప్పారు. సమాజంలో సమకాలీన అంశాల పట్ల అవగాహన ఉన్న ఆయనను పార్లమెంట్ అభ్యర్థిగా నియమించడం ఆనందంగా ఉందన్నారు. పదవుల కోసం గోడలు దూకే వాళ్లు ఉన్నారన్నారు. నిస్వార్ధంగా సేవ చేస్తున్న డాక్టర్ చంద్ర శేఖ‌ర్‌ లాంటి వారు ఎన్నికల్లో పోటీ చేయాలని పేర్ని నాని అన్నారు.

సేవ చేయాలనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి..: సింహాద్రి చంద్రశేఖర్

ప్రజలకు సేవ చేయాలనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని వైసీపీ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ అన్నారు. అసెంబ్లీకి తాను పోటీచేయనని సీఎం జగన్‌కు చెప్పానని తెలిపారు. ఈరోజు మచిలీపట్నం ఎంపీగా నియమించారని చెప్పారు. ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాలల్లో తాను ఎప్పుడు లేనని అన్నారు. వైద్యుడిగా సేవలు అందిస్తున్న తాను ఇకపై ప్రజలకు మరింత సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. సీఎం స్వయంగా ఎంపీగా పోటీ చేయాలని తనను కోరారని సింహాద్రి చంద్రశేఖర్ తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 07 , 2024 | 10:32 PM