Share News

Perni Nani: వైసీపీ జెండా లేకుండా కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే కాగలరా?

ABN , Publish Date - Jan 05 , 2024 | 09:36 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు.

Perni Nani: వైసీపీ జెండా లేకుండా కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే కాగలరా?

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు.

"పవన్ చెప్తున్న కాపు పెద్దలు ఎవరు..?. మేము ఎవరిని రెచ్చగొట్టాం. ఎవరు ఏమీ మాట్లాడారు..?. తునిలో కాపు మీటింగ్ పెట్టిన ఆయన చాలా కాలంగా మాట్లాడుతున్నాడు. 2014లో కాపులకు రిజ్వేషన్ హామీ ఇచ్చారు కనుక చంద్రబాబు, పవన్‌లను ముద్రగడ అడిగాడు. ఎవరో మాట్లాడితే వైసీపీకి ఏమీ బాధ్యత..?. హరిరాయజోగయ్య గురించి మాకు ఏమీ అవసరం. ఆయన పవన్ cm అవ్వాలని అంటున్నాడు. కాపులను టీడీపీకి తాకట్టు పెట్టే విధానాన్ని ప్రశ్నిస్తే వైసీపీకి ఏం సంబంధం..?. వేరే పార్టీలో నుంచి ఎవరిని చేర్చుకొను కొత్త వాళ్ళని తయారు చేస్తాను అన్నాడు. ఇప్పుడు పోటీకి ఎవరూ లేక వాకిలి తెరిచి ఉంటుందని అంటున్నాడు. చంద్రబాబు ఇచ్చే 20 సీట్లకు పోటీ చేసే వారే పవన్ దగ్గర లేరు." అని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు.

"అవసరాల కోసం వచ్చిన వాళ్ళే బయటకి వెళ్తారు. పార్టీపై, ప్రజలపై ప్రేమ ఉన్న వారు పార్టీలో ఉంటారు. కాపు రాచంద్రారెడ్డి వైసీపీ తరుపున రెండు సార్లు ఎమ్మేల్యే అయ్యారు. కాపు రామచంద్రారెడ్డి వైసీపీ జెండా లేకుండా ఎమ్మెల్యే కాగలరా?. ఎన్ని డబ్బులు ఉన్న ఎమ్మెల్యే అవుతారా?." అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.

షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. రాజకీయ నాయకులు పార్టీలు మారడానికి అలవాటు పడ్డారని, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆమె ఇష్టమని అన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 09:53 PM