Nimmala Ramanayudu: పట్టిసీమ ఎత్తిపోతల పథకం పైప్ లైన్ లీకేజిపై నిమ్మల ఆరా
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:39 PM
పట్టిసీమ ఎత్తిపోతల పథకం పైప్ లైన్ లీకేజిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరా తీశారు. ఈ మేరకు ఆయన సంబంధిత జలవనరుల శాఖ ఇంజినీర్‌లతో నిమ్మల ఫోన్‌లో మాట్లాడారు.

అమరావతి: పట్టిసీమ (Pattiseema) ఎత్తిపోతల పథకం పైప్ లైన్ లీకేజిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanayudu) ఆరా తీశారు. ఈ మేరకు ఆయన సంబంధిత జలవనరుల శాఖ ఇంజినీర్‌లతో నిమ్మల ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే లీకేజిని అరికట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో లీకేజీ నివారించే చర్యలను అధికారులు చేపట్టారు. నీటి విడుదలను తాత్కాలికంగా నిలిపి వేసి జలవనరుల శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. ఇటుకల కోట డెలివరీ ఛానల్‌కు వెళ్లే పైపు లైన్ వాల్ ప్లేట్ ఊడిపోవడంతో గోదావరి జలాలు ఎగజిమ్ముతున్నాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేర పంట పొలాల్లో నీరు చేరింది. లీకేజ్ ప్రాంతానికి వెళ్ళడానికి , పొలాల్లోకి వెళ్ళడానికి మార్గం మూసుకు పోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కాగా.. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 2,800 క్యూసెక్కుల గోదావరి జలాలు పోలవరం ప్రాజెక్టు కుడి కాలవకు తాజాగా విడుదల చేయడం జరిగింది. పట్టిసీమ వద్ద గోదావరి నీటిమట్టం 14.74 మీటర్లకు పైబడి ఉండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 8 పంపులు 8 మోటార్ల ద్వారా నీటి పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే పైప్‌లైన్ లీకేజీ జరిగిందిఇటుకల కోట డెలివరీ ఛానల్‌కు వెళ్లే పైపు లైన్ వాల్ ప్లేట్ ఊడిపోయింది. దీంతో మంత్రి నిమ్మల వెంటనే స్పందించారు. లీకేజీని సత్వరమే అరికట్టాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
Andhra Pradesh: అమరావతికి కేంద్ర సంస్థల క్యూ!
BRS: బీఆర్ఎస్ నుంచి మరో కీలక వికెట్ ఔట్..!
Read Latest AP News And Telugu News