Nara Lokesh: యాత్ర 2 ఒక చెత్త సినిమా.. వైసీపీది ఓ దున్నపోతు ప్రభుత్వం
ABN , Publish Date - Feb 14 , 2024 | 07:53 PM
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తాజాగా జగన్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. వైసీపీదీ దున్నపోతు ప్రభుత్వమని విమర్శించిన ఆయన.. ‘యాత్ర 2’ ఒక చెత్త సినిమా అని దుయ్యబట్టారు. మన్యం జిల్లాలో జరిగిన శంఖారావం సభలో లోకేశ్ మాట్లాడుతూ.. కలుషిత నీరు తాగి మృతి చెందిన కుటుంబాలను కూడా పరామర్శించని దిక్కుమాలిన సీఎం జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తాజాగా జగన్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. వైసీపీదీ దున్నపోతు ప్రభుత్వమని విమర్శించిన ఆయన.. ‘యాత్ర 2’ ఒక చెత్త సినిమా అని దుయ్యబట్టారు. మన్యం జిల్లాలో జరిగిన శంఖారావం సభలో లోకేశ్ మాట్లాడుతూ.. కలుషిత నీరు తాగి మృతి చెందిన కుటుంబాలను కూడా పరామర్శించని దిక్కుమాలిన సీఎం జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల జీవితాలతో ఆడింది చాలదా జగన్ అని ప్రశ్నించారు. ఆడుదాం ఆంధ్రాలో కూడా జగన్ కపట రాజకీయాలేనని ఆరోపించారు. పార్ధసారధి వంటి సీనియర్ నేతకు కూడా జగన్ దర్శనం దొరకదని చెప్పారు. ఎన్నికల ముందు 25 ఎంపీలు గెలిస్తే ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన జగన్.. ఆ దిశగా కృషి చేశారా? అని నిలదీశారు.
వైసీపీకి 22 మంది లోక్‌సభ, 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నప్పటికీ.. ప్రత్యేక హోదాపై ఏనాడైనా అడిగారా? అని నారా లోకేశ్ ప్రశ్నించారు. ఎన్నికల వేళ జగన్ ఇప్పటిదాకా 63 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎంపీలను బదిలీ చేశారని.. వారిలో 90 శాతం బీసీ, ఎస్సీ నాయకులేనని చెప్పారు. అయితే.. తాము అధికారంలోకి వస్తే ఉప కులాల వారీగా వెనుకబడిన తరగతులకు భారీగా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రానున్న టీడీపీ, జనసేన ప్రభుత్వంతో ఐదేళ్లలో 25 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భరోసా కల్పించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నడిపే బాధ్యత రాబోయే తమ ప్రభుత్వమే నిర్వహిస్తుందని తెలిపారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి భూసేకరణ చేసింది తమ టీడీపీ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా లోకేశ్ గుర్తు చేశారు.