Share News

Mukesh Kumar Meena: ఓటర్ల జాబితా రూపకల్పనపై వీడియో కాన్ఫరెన్స్..

ABN , Publish Date - Feb 02 , 2024 | 01:58 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆరోపణలకు ఆస్కారం లేని ఓటర్ల జాబితా తయారీపై సచివాలయంలో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సరైన ఓటర్ల జాబితా రూపకల్పనలో జిల్లా ఎన్నికల అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు.

Mukesh Kumar Meena: ఓటర్ల జాబితా రూపకల్పనపై వీడియో కాన్ఫరెన్స్..

అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆరోపణలకు ఆస్కారం లేని ఓటర్ల జాబితా తయారీపై సచివాలయంలో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సరైన ఓటర్ల జాబితా రూపకల్పనలో జిల్లా ఎన్నికల అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారంపై చర్చించనున్నారు. ప్రత్యేకించి యువకులను ఓటర్లుగా నమోదు చేసే కార్యక్రమం, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, కనీస వసతులు కల్పన వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు.

అధికారులు, సిబ్బంది నియామకం, ఉద్యోగులకు శిక్షణ, జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళికపై అధికారులను ముఖేష్ కుమార్ మీనా విచారించారు. ప్రాంతాల వారీగా పోలింగ్ స్టేషన్లలో మ్యాపింగ్, అక్రమ నగదు స్వాధీనం, వివిధ వర్గాల నుంచి అందే ఫిర్యాదుల పరిష్కారంపై చర్చించనున్నారు. ఈ అంశాల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్షించారు. సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈవో పి.కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరెందిర ప్రసాద్, డిప్యూటీ సీఈవోలు ఎస్.మల్లిబాబు, కే.విశ్వేశ్వరరావు హజరయ్యారు.

Updated Date - Feb 02 , 2024 | 02:01 PM