Chairman of Minority Finance : అధినేత నమ్మకాన్ని వమ్ముచేయను

ABN , First Publish Date - 2024-12-10T05:26:13+05:30 IST

రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ బాధ్యతలు స్వీకరించారు.

Chairman of Minority Finance  : అధినేత నమ్మకాన్ని వమ్ముచేయను

  • మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌

విజయవాడ (వన్‌టౌన్‌), డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్‌ ఎండీ యాకూబ్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా మౌలానా ముస్తక్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో అనేక సవాళ్లను, కేసులను ఎదుర్కొన్న ప్రతి కార్యకర్తకూ న్యాయం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానంటూ చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్‌ అహ్మద్‌ షరీఫ్‌, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్‌, నక్కా ఆనంద్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - 2024-12-10T05:26:16+05:30 IST