Share News

MLA Vasantha Krishna Prasad: సిద్ధం సభకు ఎమ్మెల్యే వసంత దూరం..

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:43 PM

వైసీపీ ఎన్నికల శంఖారావం బహిరంగసభ ‘సిద్ధం’కు ఏలూరు ముస్తా­బ­వుతోంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కేడర్‌ను సభకు తరలించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఏలూరులో రేపు జరిగే సిద్ధం సభకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ హ్యాండ్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.

MLA Vasantha Krishna Prasad: సిద్ధం సభకు ఎమ్మెల్యే వసంత దూరం..

అమరావతి: వైసీపీ ఎన్నికల శంఖారావం బహిరంగసభ ‘సిద్ధం’కు ఏలూరు ముస్తా­బ­వుతోంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కేడర్‌ను సభకు తరలించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఏలూరులో రేపు జరిగే సిద్ధం సభకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ హ్యాండ్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. తాను సభకు రానని కృష్ణప్రసాద్ స్పష్టం చేశారని సమాచారం.

జనసమీకరణ కూడా తాను చేయబోనని వసంత చెప్పారు. వైసీపీ హైకమాండ్‌తో సైతం ఆయన అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. మైలవరంలో జన సమీకరణ బాధ్యతలను ఎంపీ కేశినేని నానికి వైసీపీ అప్పజెప్పింది. త్వరలోనే వసంత వైసీపీకి గుడ్ బై చెబుతారని సమాచారం. వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమం ఉన్నప్పటికీ అభివృద్ధి లేదని ఇటీవలే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. కాంట్రాక్టర్లకు బిల్లులు రాక ఆస్తులు అమ్ముకుంటున్నారని చెప్పారు. త్వరలో టీడీపీలో వసంత చేరుతారని ప్రచారం జరుగుతోంది.

Updated Date - Feb 02 , 2024 | 12:43 PM