Share News

Minister Ambati: సరుకు వదలకుంటే.. నీ అంతు తేలుస్తా!

ABN , Publish Date - Apr 12 , 2024 | 07:38 AM

‘వచ్చేది మా ప్రభుత్వమే. పట్టుకున్న మద్యాన్ని ఇచ్చేయండి. వాహనాన్ని వదిలి పెట్టండి. మా కార్యకర్తలపై కేసు పెట్టొద్దు’ అంటూ మంత్రి అంబటి రాంబాబు గురువారం సాయంత్రం సెబ్‌ ఎస్‌ఐ శ్రీనివాసరావును బెదిరించారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలకు చెందిన బొప్పూడి షేక్‌ మస్తాన్‌వలి, మరో యువకుడు ద్విచక్ర వాహనంపై కొమెరపూడి నుంచి బస్తాలో మద్యం సీసాలు తీసుకువస్తున్నారు.

 Minister Ambati: సరుకు వదలకుంటే.. నీ అంతు తేలుస్తా!

● మద్యం పట్టుకున్న సెబ్‌ ఎస్‌ఐకి మంత్రి అంబటి బెదిరింపు

సత్తెనపల్లి, ఏప్రిల్‌ 11: ‘వచ్చేది మా ప్రభుత్వమే. పట్టుకున్న మద్యాన్ని ఇచ్చేయండి. వాహనాన్ని వదిలి పెట్టండి. మా కార్యకర్తలపై కేసు పెట్టొద్దు’ అంటూ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) గురువారం సాయంత్రం సెబ్‌ ఎస్‌ఐ శ్రీనివాసరావును బెదిరించారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలకు చెందిన బొప్పూడి షేక్‌ మస్తాన్‌వలి, మరో యువకుడు ద్విచక్ర వాహనంపై కొమెరపూడి నుంచి బస్తాలో మద్యం సీసాలు తీసుకువస్తున్నారు. దీనిపై సమాచారం రావడంతో సత్తెనపల్లి సెబ్‌ ఎస్‌ఐ కొమెరపూడిలో తనిఖీలు చేపట్టారు.

పోలీసులను చూసిన మస్తాన్‌వలి, మరో యువకుడు మద్యాన్ని, బైక్‌ను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ విషయం అంబటి రాంబాబుకు తెలియడంతో, ఆయన హుటాహుటిన సెబ్‌ పోలీసు స్టేషన్‌కు వచ్చారు. ‘మస్తాన్‌వలి మా కార్యకర్తే, మద్యాన్ని, వాహనాన్ని వదిలేయండి’ అని డిమాండ్‌ చేశారు. వదిలే ప్రసక్తే లేదని ఎస్‌ఐ చెప్పడంతో మంత్రి పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ‘వచ్చేది మా ప్రభుత్వమే. నీ అంతు తేలుస్తా’ అంటూ రుసరుసలాడుతూ వెళ్లిపోయాడు. ఆతర్వాత ఎస్‌ఐ మీడియాతో మాట్లాడుతూ.. 170 మద్యం బాటిళ్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మస్తాన్‌వలి మరో యువకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 12 , 2024 | 07:55 AM