Monthly Magazine : ‘మనబడి’ మాస పత్రిక ఆవిష్కరణ
ABN , Publish Date - Dec 09 , 2024 | 04:43 AM
ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఉపయోగపడేలా ‘మన బడి’ పేరుతో మాసపత్రికను అందుబాటులోకి తెచ్చినట్లు సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
అమరావతి, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఉపయోగపడేలా ‘మన బడి’ పేరుతో మాసపత్రికను అందుబాటులోకి తెచ్చినట్లు సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తాజాగా జరిగిన పేరెంట్- టీచర్స్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ మాసపత్రికను ఆవిష్కరించారని తెలిపారు. విద్యార్థులు వేసిన బొమ్మలు, రాసిన కథలు, కవితలు, పాటలు, చేసిన వినూత్న ప్రయోగాలు, క్రీడల్లో సాధించిన విజయాలు, విద్యార్థుల విజయ గాథలకు ఇందులో ఎక్కువ ప్రాధాన్యతనిస్తామని వెల్లడించారు.