సమసమాజ స్థాపనే సీపీఐ లక్ష్యం

ABN, Publish Date - Aug 09 , 2024 | 12:49 AM

సమసమాజ స్థాపనే భారత కమ్యూనిస్టు పార్టీ లక్ష్యమని జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య అన్నారు.

ఓర్వకల్లు, ఆగస్టు 8: సమసమాజ స్థాపనే భారత కమ్యూనిస్టు పార్టీ లక్ష్యమని జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య అన్నారు. గురువారం ఓర్వకల్లు మం డల నాల్గవ మహాసభ ఘనంగా నిర్వహించారు. ముందుగా బస్టాండు నుం చి పొదుపు భవన వరకు సీపీఐ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పొదుపు భవనలో జరిగిన మహాసభకు సీపీఐ మాజీ మండల కార్యదర్శి దస్తగిరి అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా గిడ్డయ్య మాట్లాడు తూ దేశంలో రోజురోజుకు ఆర్థిక సమానతలు పెరిగిపోతున్నాయని, కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం అంబాని, అదానీలకు ఊడిగం చేస్తూ దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు దోచి పెడుతున్నామని మండిపడ్డారు. అనంతరం నూతన కమిటీనిఎన్నుకున్నారు. ఓర్వకల్లు నూతన కమిటీ సీపీఐ మండల కార్యదర్శి గా ఆవుల రమేష్‌, సహాయ కార్యదర్శిగా సుధాకర్‌లను ఎన్నుకున్నారు.

Updated at - Aug 09 , 2024 | 12:49 AM