Share News

YS Vimala Reddy: జగన్ తరఫున రంగంలోకి దిగిన మేనత్త

ABN , Publish Date - Feb 08 , 2024 | 08:23 AM

కృష్ణా జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా ఆయన బలగం మొత్తం రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌ను ఎన్నికల్లో మరోసారి గెలిపించేందుకు ఆయన బంధువు (మేనత్త) వైఎస్ విమలా రెడ్డి పావులు కదుపుతున్నారు.

YS Vimala Reddy: జగన్ తరఫున రంగంలోకి దిగిన మేనత్త

కృష్ణా జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా ఆయన బలగం మొత్తం రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌ను ఎన్నికల్లో మరోసారి గెలిపించేందుకు ఆయన బంధువు (మేనత్త) వైఎస్ విమలా రెడ్డి పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో గన్నవరంలో ఫాస్టర్లు తో విమలా రెడ్డి సమావేశమయ్యారు. గన్నవరం ఏబీకన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో సేవకుల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గన్నవరం నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో పాస్టర్‌లు హాజరయ్యారు.

సేవకుల సదస్సుకు ముఖ్యఅతిథులుగా వైయస్ విమలారెడ్డి, ప్రభుత్వ అడ్వైజర్ ఫాదర్ బాలస్వామి, మేడిది జాన్సన్‌లు హాజరయ్యారు. ఎమ్మెల్యే వంశీ ముఖ్య అనుచరులే ఈ సదస్సు సూత్రధారులు. జగన్, వంశీ ప్లెక్సీలతో సేవకుల సదస్సు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సదస్సులో ఫ్లెక్సీలపై ఎక్కడ జీసస్ ఫోటో కనిపించలేదు. ఈ సందర్భంగా ఫాదర్ బాలస్వామి మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంను చేయాలని పిలుపిచ్చారు. జగన్ ప్రతిసారి ఇది మీ బిడ్డ ప్రభుత్వం అంటారని, రెండు లక్షల 55 వేల కోట్ల రూపాయలు బట్టన్ నొక్కి పేద ప్రజల అకౌంటుల్లో వేసిన దమ్మున్న నాయకుడని అన్నారు. గన్నవరం వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వంశీకి బటన్ నొక్కి గెలిపించాలని, అది మన బాధ్యత అని అన్నారు

వైయస్ విమలా రెడ్డి మాట్లాడుతూ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారని, సేవకులుగా మనందరం కలిసి ప్రభుత్వానికి అండగా ఉంటే పథకాలన్నీ ప్రజలకు అందుతాయని అన్నారు. ప్రభుత్వాన్ని కొనసాగించడానికి మనందరం సహాయపడితే ప్రజలను రక్షించిన వాళ్ళమవుతామని అన్నారు. ఫాదర్ బాలస్వామి చెప్పినట్లు అందరూ బయటకు వెల్లి ప్రకటించాలని సూచించారు. పథకాల గురించి ప్రజలకు చెబితే సీఎం జగన్‌పై విశ్వాసం పెరుగుతుందన్నారు. యాక్టివ్‌గా అందరూ కలిసి పనిచేయాలని విమలా రెడ్డి కోరారు.

Updated Date - Feb 08 , 2024 | 08:23 AM