Share News

AP Assembly: రెండవ రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ABN , Publish Date - Feb 06 , 2024 | 09:27 AM

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. నిత్యావసర వస్తువుల ధరలపై తెలుగుదేశం వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. దీన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు.

AP Assembly: రెండవ రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. నిత్యావసర వస్తువుల ధరలపై తెలుగుదేశం వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. దీన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుపట్టారు. కాగా గంటా శ్రీనివాస రావు రాజీనామాను ఆమోదించినట్టు స్పీకర్ వెల్లడించారు. తర్వాత సభలో సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపంగా సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.

అనంతరం వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. గ్యాస్ ధరలు పెరిగాయని అందువలన చర్చ చేపట్టాలన్నారు. అందుకు సభాపతి అంగీకరించకపోవడంతో బాదుడే బాదుడు అంటూ టీడీపీ ఎమ్మెల్యే లు స్పీకర్ పొదయం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. కరెంట్ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు, చెత్తపై పన్ను , ఇళ్ల పన్నులు బాదుడే బాదుడు అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.

Updated Date - Feb 06 , 2024 | 09:27 AM