Share News

TDP: కూటమి ప్రభుత్వం ఆరు నెలల విజయాలపై కరపత్రం విడుదల

ABN , Publish Date - Dec 11 , 2024 | 03:56 PM

Andhrapradesh: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలను పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆరు నెలల విజయాలను టీడీపీ నేతలు మీడియాకు వివరించారు. ఆరు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన టాప్ 20 కార్యక్రమాల వివరాల కరపత్రికను బుధవారం టీడీపీ నేతలు విడుదల చేశారు.

TDP: కూటమి ప్రభుత్వం ఆరు నెలల విజయాలపై కరపత్రం విడుదల
Pamphlet released on six-month achievements of AP government

అమరావతి, డిసెంబర్ 11: ఏపీ ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించి కూటమి ప్రభుత్వం విజయం సాధించి అధికారాన్ని చేతబట్టింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) దూసుకెళ్తున్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. పెన్షన్ల పెంపు, దీపం పధకాన్ని ఇప్పటికే అమలు అయ్యాయి. అలాగే మరిన్ని పధకాలను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వ సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలను పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆరు నెలల విజయాలను టీడీపీ నేతలు మీడియాకు వివరించారు. ఆరు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన టాప్ 20 కార్యక్రమాల వివరాల కరపత్రికను బుధవారం టీడీపీ నేతలు విడుదల చేశారు.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు


ఈ సందర్భంగా తొండపూజ దశరథ జనార్ధన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ ఏర్పాటు అయ్యి ఆరు నెలలు పూర్తయిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు వైసీపీ పాలనలో స్వేచ్ఛ స్వతంత్రాలను పోగొట్టుకున్నారని.. గడిచిన ఐదేళ్లలో ప్రజల ఆస్తులకు మానప్రాణాలకు కూడా భద్రత లేదన్నారు. ప్రజల ఆస్తులను బహిరంగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పేరుతో దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన ఆరు నెలల నుంచి ప్రజలు స్వేచ్ఛ స్వతంత్రాలను అనుభవిస్తున్నారని తెలిపారు. గడిచిన ఆరు నెలల్లో ప్రజలు తమ సమస్యలను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వానికి చెప్పుకుంటున్నారన్నారు. రాబోయే ఐదేళ్లలో 1,60,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో ఇవ్వబోతున్నామని వెల్లడించారు. సంక్షేమ విషయంలో వైసీపీ ప్రభుత్వానికి టీడీపీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.


అబద్ధాలు.. జగన్ కవల పిల్లలు: వర్ల

ఆరు నెలల కాలంలో టీడీపీ టాప్ 20 కార్యక్రమాలను వివరించిన ఆ పార్టీ నేత వర్ల రామయ్య వివరించారు. ఆరు నెలల్లో జరిగిన కూటమి పరిపాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. గడిచిన ఐదేళ్లలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఏనాడు కేంద్రం దృష్టికి తీసుకురాలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా ఎక్కడా సంక్షేమానికి ఇబ్బంది కలగకుండా చూస్తున్నామని తెలిపారు. అబద్ధాలు.. జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కవల పిల్లలాంటివారని విమర్శించారు. అన్ని వర్గాల ఆకాంక్షలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని వర్ల రామయ్య పేర్కొన్నారు.


జగన్‌కు మాల్యాద్రి సవాల్..

హామీల అమలులో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని జగన్ అబద్ధాలు చెప్తున్నారని టీడీపీ నేత మాల్యాద్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి ఆరు నెలల కాలంలో టీడీపీ.. వైసీపీ ప్రభుత్వాల మధ్య జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తన కుంభకోణాల నుంచి దృష్టి మళ్లించడానికి కూటమి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ప్రజల మధ్య కుల మత ప్రాంతీయ చిచ్చులు పెట్టి తన దోపిడీ నుంచి జగన్ దృష్టి మళ్లిస్తున్నారని విమర్శించారు. ఇటువంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కులతత్వాన్ని రెచ్చగొట్టే విధంగా జగన్ చూస్తున్నారని మాల్యాద్రి వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

Pawan: ప్రతీసారి మీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు

AP highcourt: అదానీతో విద్యుత్ ఒప్పందాలపై హైకోర్టులో విచారణ.. ఏం జరిగిందంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 11 , 2024 | 03:56 PM