AP News: గన్నవరం చేరుకున్న హాజ్ యాత్రికులు.. స్వాగతం పలికిన మంత్రి ఫరూక్
ABN , Publish Date - Jul 10 , 2024 | 10:13 PM
సౌదీ అరేబియాలోని మదీనాను సందర్శించిన హాజ్ యాత్రికులు బుధవారం గన్నవరం చేరుకున్నారు. 322 మంది ప్రయాణీకులతో కూడిన ప్రత్యేక విమానం గన్నవరం చేరుకుంది. ఏపీ మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ హాజ్ యాత్రికులకు స్వాగతం పలికారు.
గన్నవరం: సౌదీ అరేబియాలోని మదీనాను సందర్శించిన హాజ్ యాత్రికులు బుధవారం గన్నవరం చేరుకున్నారు. 322 మంది ప్రయాణీకులతో కూడిన ప్రత్యేక విమానం గన్నవరం చేరుకుంది. ఏపీ మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ హాజ్ యాత్రికులకు స్వాగతం పలికారు. కాగా హజ్ యాత్రికులకు స్వాగతం పలికేందుకు వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కాగా హజ్ యాత్రికుల కోసం ఎయిర్‌పోర్టులో ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాట్లు చేశారు.
మంత్రి ఫరూక్ మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి వెళ్లిన హాజీలలో ఒకరు తప్ప మిగతా వారంతా సురక్షితంగా తిరిగొచ్చారని అన్నారు. హజ్ యాత్రలో ఒకరు గుండెపోటుతో మరణించారని వెల్లడించారు. హాజ్ పవిత్ర యాత్రను ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన 322 హాజీలకు ప్రభుత్వం తరఫున స్వాగతం పలికామని, గత ప్రభుత్వం హాజీలకు లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తానని మోసం చేసిందని ఆయన విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం హాజీలకు భవిష్యత్తులో చేయబోయే యాత్రలకు గత ప్రభుత్వం మోసం చేసిన లక్ష రూపాయలతో కలిపి సబ్సిడీ కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. భవిష్యత్తులో జరగబోయే మరిన్ని కార్యక్రమాలకు టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలకు సహాయపడుతుందని ఆయన భరోసా ఇచ్చారు.