Share News

Rameshnaidu: అది ఒక చారిత్రాత్మక నిర్ణయం

ABN , Publish Date - Dec 14 , 2024 | 12:51 PM

Andhrapradesh: ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా 2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశారని బీజేపీ నేత రమేష్ నాయుడు తెలిపారు. కూటమి మంచి ఆలోచనతో ముందుకు వెళ్తోందన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అసత్యపు పాలన, అవినీతి గొడుగు కింద రాష్ట్రంలో పాలన కొనసాగించారని విమర్శించారు. గతంలో సీఎం చంద్రబాబు విజన్ 2020 పెట్టారని.. గతంలో తాము విమర్శించాము కానీ అది 2020 విజన్ నిజం అని తెలుసుకున్నామని చెప్పుకొచ్చారు.

Rameshnaidu: అది ఒక చారిత్రాత్మక నిర్ణయం
BJP Leader Ramesh naidu

అమరావతి, డిసెంబర్ 14: రాష్ట్రంలో కూటమి తరఫున సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ప్రవేశపెట్టిన 2047 విజన్ డాక్యుమెంట్ ఒక చారిత్రాత్మక నిర్ణయం అని ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు(AP BJP State Secretary Ramesh Naidu) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా విడుదల చేశారని తెలిపారు. కూటమి మంచి ఆలోచనతో ముందుకు వెళ్తోందన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అసత్యపు పాలన, అవినీతి గొడుగు కింద రాష్ట్రంలో పాలన కొనసాగించారని విమర్శించారు. గతంలో సీఎం చంద్రబాబు విజన్ 2020 పెట్టారని.. గతంలో తాము విమర్శించాము కానీ అది 2020 విజన్ నిజం అని తెలుసుకున్నామని చెప్పుకొచ్చారు.

సారీ చెప్పిన బన్నీ


2047 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శక్తిగా ఎదగాలని కోరుకుంటున్నామన్నారు. సాగునీటి నుంచి వైద్యం వరకు ఏపీ అభివృద్ధి చెందిన లక్ష్యంతో చంద్రబాబు నాయుడు విజన్ 2047 ఏర్పడిందన్నారు. జగన్ ఇష్టానుసారంగా మాట్లాడకుండా ప్రతిపక్ష నాయకుడి హోదా కాపాడుకోవాలని హితవుపలికారు. ఏపీలో కావాల్సిన వనరులు ఉన్నాయన్నారు. ప్రజల అందరినీ దృష్టిలో పెట్టుకొని విజన్ 2047 తీసుకొచ్చారన్నారు. కేంద్రంలో మోడీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నారన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం చీకటి జీవోలు ఇచ్చిందని విమర్శించారు. మాఫియా రాజ్యం పక్కకు వెళ్లి అధికార వికేంద్రీకరణ రాష్ట్రంలో జరుగుతోందన్నారు. ఏపీలో చక్కటి పాలన జరుగుతోందన్నారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దూసుకెళ్తోందని ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు పేర్కొన్నారు.

అల్లు అర్జున్ ఇంటికి సురేఖ


జగన్ సిద్ధమా: సోమిరెడ్డి

Somireddy.jpg

అమరావతి: స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ లో వ్యవసాయానికి, రైతాంగానికి పెద్దపీఠ వేశామని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డికి రైతు అనే పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదన్నారు. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని మొదటి స్థానానికి తీసుకెళ్లిన ఘనత జగన్ ది అంటూ మండిపడ్డారు. వ్యవసాయ శాఖను చంపేసి, సూక్ష్మ సేద్యం, పోషకాలు, ఇతరత్రా రైతు ప్రోత్సాహకాలు దూరం చేశారన్నారు. జగన్ వల్ల వ్యవసాయ రంగం ఎంత నష్టపోయిందో పులివెందుల రైతులే చెప్తారన్నారు. వ్యవసాయ శాఖపై శ్వేతపత్రం విడుదలకు తాము సిద్ధమని.. జగన్ సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. ప్యాలెస్‌లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ఏనాడైనా వ్యవసాయ శాఖ సమీక్ష జరిపారా అని ప్రశ్నించారు. ఏ2, ఏ2 వియ్యంకుడి సాయంతో రేషన్ బియ్యం విదేశాలకు పంపి కోట్లు దండుకోవటం ఒక్కటే జగన్ చేశారని ఆరోపించారు. దేశంలో రైతులపై తలసరి సగటు అప్పు 74500 ఉంటే ఏపీలో 2.45లక్షలు ఉండతానికి కారణం జగన్ కాదా అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి..

Nara Lokesh: విద్యారంగంలో సంస్కరణలు తప్పవు

మీడియా ముందుకు ‘పుష్ప’.. అరెస్ట్‌పై ఏమన్నారంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 14 , 2024 | 01:00 PM