Share News

AP News: వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ పొడిగింపునకు ప్రభుత్వం ఆమోదం

ABN , Publish Date - Jul 11 , 2024 | 08:22 PM

వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీం(WJHS) పొడిగింపునకు సీఎం చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రికి సమాచార శాఖ ప్రతిపాదనలు పంపించింది.

AP News: వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ పొడిగింపునకు ప్రభుత్వం ఆమోదం
AP Govt Logo

అమరావతి: వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీం(WJHS) పొడిగింపునకు సీఎం చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రికి సమాచార శాఖ ప్రతిపాదనలు పంపించింది. వైద్యారోగ్య శాఖ మంత్రి పంపిన ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదముద్ర వేశారు. జర్నలిస్ట్ హెల్త్ స్కీం ద్వారా 11,200 మంది జర్నలిస్టులకు, 34 వేల మంది కుటుంబ సభ్యులకు లబ్ధి జరుగుతోందని ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. జర్నలిస్టు కుటుంబాల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని భరోసా ఇచ్చారు.

Updated Date - Jul 11 , 2024 | 09:12 PM