సముద్రంలో ఉన్న నౌకలో కలెక్టర్ తనిఖీలు
ABN , Publish Date - Nov 28 , 2024 | 04:44 AM
దక్షిణాఫ్రికాకు బియ్యం రవాణా చేస్తున్న నౌకను తనిఖీ చేసేందుకు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ బుధవారం పెద్ద సాహసమే చేశారు.

దక్షిణాఫ్రికాకు వెళ్లే నౌకలో 640 టన్నుల పీడీఎస్ బియ్యం గుర్తింపు
కలెక్టరేట్ కాకినాడ, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): దక్షిణాఫ్రికాకు బియ్యం రవాణా చేస్తున్న నౌకను తనిఖీ చేసేందుకు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ బుధవారం పెద్ద సాహసమే చేశారు. సముద్రంలో ఉన్న భారీ నౌకను చేరుకునేందుకు యాంకరేజ్ పోర్టు నుంచి గంటపాటు ప్రయాణించి నౌకలో సోదాలు చేశారు. దక్షిణాఫ్రికాకు వెళ్తున్న ఈ స్టెల్లా ఎల్ నౌకలో 640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి శాంపిల్స్ సేకరించారు. జూన్‌లో సీజ్ చేసిన పీడీఎస్ బియ్యాన్ని ఇటీవల విడుదల చేశామని, నౌకలో ఉన్న బియ్యం.. తాము విడుదల చేసిన బియ్యం ఒక్కటేనా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.