కాంట్రాక్టు నర్సుల సమస్యలను తక్షణం పరిష్కరించాలి
ABN , Publish Date - Sep 13 , 2024 | 11:18 PM
అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు విధానం లో పనిచేస్తున్న నర్సుల ఉద్యోగాలకు నష్టం కలిగించే జీవో నెంబర్ 115ను రద్దు చేసి సమస్యలు తక్షణం పరి ష్కరించాలని బాధిత నర్సులు డి మాండ్ చేశారు.
మదనపల్లె టౌన, సెప్టెంబరు 13: అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు విధానం లో పనిచేస్తున్న నర్సుల ఉద్యోగాలకు నష్టం కలిగించే జీవో నెంబర్ 115ను రద్దు చేసి సమస్యలు తక్షణం పరి ష్కరించాలని బాధిత నర్సులు డి మాండ్ చేశారు. ఆ మేరకు శుక్రవా రం స్థానిక సర్వజన బోధనాస్పత్రి వద్ద మోకాళ్లపై కూర్చొని నర్సులు వినూ త్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 11 ఏళ్లుగా కాంట్రాక్టు విధానంలో విధులు నిర్వహిస్తున్నా సమస్యలు పరిష్కరించడంలేదన్నారు. ఇప్పుడు జీవో నెంబర్ 115తో స్కిల్డ్ ఉద్యోగుల పేరిట కొత్తవారిని తీసు కొచ్చి తమకు అన్యాయం చేయవద్దని డిమాండ్ చేశారు.
నిమ్మనపల్లిలో: గత ప్రభుత్వం తీసుకొచ్చిన 115 జీవో రద్దుపరచి తమకు న్యాయం చేయాలని స్టాప్‌నర్సులు శుక్రవారం స్థానిక ప్రభ్తుత్వ ఆసుపత్రి వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఏఎనఎమ్‌లుగా సచివా లయాల్లో పని చేస్తున్న వారికి జీఎనఎమ్‌లుగా మారుస్తూ జీవో ఇవ్వడంతో బీఎస్‌సీ, స్టాప్‌నర్సు, జీఎనఎమ్‌లు కోర్సులు చదివి వచ్చిన నర్సులకు తీవ్ర అన్యాయం జరు గుతోందని వాపోయారు. దీని ద్వారా అర్హులైన వారు అన్యాయం అయిపోతారని వెంటనే 115 జీవోను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టాప్‌నర్సులు యమున, రెడ్డెమ్మ, ఇంద్రజ తదితలు పాల్గొన్నారు.