Share News

Dastagiri Wife: నా భర్తని బలిపశువు చేశారు: దస్తగిరి భార్య షబానా

ABN , Publish Date - Jan 25 , 2024 | 02:01 PM

కడప: సీఎం జగన్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డిలపై దస్తగిరి భార్య షబానా ఆవేదనతో మండిపడ్డారు. నిన్న (బుధవారం) ఏపీ హైకోర్టు దస్తగిరికి బెయిల్ మంజూరు చేసింది. గురువారం ఆయన విడుదల కానున్నారు. ఈ సందర్భంగా దస్తగిరి భార్య షబానా కడపలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ..

Dastagiri Wife: నా భర్తని బలిపశువు చేశారు: దస్తగిరి భార్య షబానా

కడప: సీఎం జగన్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డిలపై దస్తగిరి భార్య షబానా ఆవేదనతో మండిపడ్డారు. నిన్న (బుధవారం) ఏపీ హైకోర్టు దస్తగిరికి బెయిల్ మంజూరు చేసింది. గురువారం ఆయన విడుదల కానున్నారు. ఈ సందర్భంగా దస్తగిరి భార్య షబానా కడపలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ‘నీ తమ్ముడు అవినాశ్ రెడ్డి తప్పు చేయకుంటే.. మీ పలుకుబడి, డబ్బులతో కోర్టులకెళ్లండి ఎక్కడకైనా వెళ్లండి.. పేదలమైన మమ్మల్ని ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారంటూ జగన్ రెడ్డిని ఉద్దేశించి ఆమె మండిపడ్డారు.

వాళ్ల సుఖాల కోసం దస్తగిరిని బలిపశువును చేశారని ఆమె అన్నారు. జగన్ రెడ్డి, అవినాశ్ రెడ్డిలను తాను ఏనాడు విమర్శించలేదని, బాధను తట్టుకోలేక ఉన్నది ఉన్నట్లు చెబుతున్నానని షబానా అన్నారు. మమ్మల్ని చంపినా పరవాలేదన్నారు. ‘‘సొంతవారినే చంపారు.. మమ్మల్ని వదిలిపెడతారనే నమ్మకం నాకు లేదు. రూ.5 కోట్లు ఇస్తామని ఆశలు కల్పించి నా భర్త దస్తగిరి జీవితాన్ని నాశనం చేశారు. చేయని తప్పులకు నా భర్తను జైలుకు పంపించి బెయిల్ రాకుండా అడుగడుగునా అడ్డుకున్నారు’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘ మీరు తప్పు చేయనప్పుడు మీకు దమ్ము ధైర్యం ఉంటే దస్తగిరిని ఇబ్బంది పెట్టవద్దు. తెలంగాణ పోలీసులతో మాకు భద్రత కల్పించాలి. లేకపోతే మేము పులివెందులలో బ్రతకలేము. సునీతమ్మ డబ్బులిచ్చారని సీబీఐ అధికారులపై పలురకాలుగా చెప్పమని నా భర్త దస్తగిరిని బెదిరించారు’’ అని అన్నారు.

కాగా కడప సెంట్రల్ జైలు నుంచి వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు దస్తగిరి గురువారం బెయిల్‌పై విడుదల కానున్నాడు. బుధవారం హైకోర్టు దస్తగిరికి బెయిల్ మంజూరు చేసింది. వివేకా హత్యకేసులో ఏ4 నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రూవర్‌గా మారాడు. దస్తగిరి నేడు విడుదల కానున్న నేపథ్యంలో ఆయన భార్య షబానా ఏబీఎన్‌తో మాట్లాడారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని.. ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని పేర్కొన్నారు. తమకు తెలంగాణ పోలీసులతో భద్రత కల్పించాలని మరోసారి షబానా విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jan 25 , 2024 | 02:43 PM