Share News

Chief Secretary : కొత్త సీఎస్‌గా విజయానంద్‌

ABN , Publish Date - Dec 29 , 2024 | 06:00 AM

రాష్ట్రప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా ఇంధన శాఖ ప్రత్యేక సీఎస్‌ కె.విజయానంద్‌ నియమితులు కానున్నారు. ప్రస్తుత సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌కు పొడిగించిన పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది.

Chief Secretary : కొత్త సీఎస్‌గా విజయానంద్‌

  • నేడో రేపో అధికారిక ప్రకటన.. నవంబరులో ఆయన రిటైర్మెంట్‌

  • ఆ తర్వాత సాయిప్రసాద్‌కు చాన్సు?: సీఎం నిర్ణయం

అమరావతి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా ఇంధన శాఖ ప్రత్యేక సీఎస్‌ కె.విజయానంద్‌ నియమితులు కానున్నారు. ప్రస్తుత సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌కు పొడిగించిన పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఆయన స్థానంలో విజయానంద్‌ను నియమించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. సీనియారిటీ ప్రాతిపదికన మొదట జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్‌ సాయిప్రసాద్‌ పేరు వినిపించినప్పటికీ.. ఆయన్ను నియమిస్తే ఆయన పదవీకాలం ముగిసేలోగా విజయానంద్‌ రిటైరవుతారు. అందువల్ల విజయానంద్‌కు ముందుగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది నవంబరులో ఆయన రిటైరయ్యాక సాయిప్రసాద్‌ను సీఎ్‌సగా నియమించాలని నిర్ణయానికి వచ్చారు. మరో ఆరు నెలల పదవీకాలం పొడిగిస్తే ఆయన కూడా ఏడాది కాలం పనిచేసినట్లవుతుందని సీఎం భావిస్తున్నారు. ఇద్దరికీ అవకాశమివ్వాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. విజయానంద్‌ కడప జిల్లాకు చెందిన వ్యక్తి. 1992 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఈయన బీసీ వర్గానికి చెందినవారు. దాంతో ముఖ్యమంత్రి ఆయన వైపు మొగ్గుచూపారు.

Updated Date - Dec 29 , 2024 | 06:00 AM