Share News

నాడు షాకులు... నేడు శోకాలు

ABN , Publish Date - Dec 28 , 2024 | 04:00 AM

‘నేను చార్జీలు పెంచుతా. ఆ చార్జీలను మీరు తగ్గించాలి’ ఇదీ... ఆయన వైఖరి. అధికారంలో ఉండగా జగన్‌ వరుసగా ఐదేళ్లపాటు ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం అమలు చేశారు.

నాడు షాకులు... నేడు శోకాలు

ఎవరు మోపిన భారం?

సంపద సృష్టిస్తామంటూ జనం నెత్తిన చంద్రబాబు 15,485 కోట్ల భారం మోపారని జగన్‌ రోత పత్రిక వాపోయింది. ఇందులో... రూ.6,072.86 కోట్ల వసూలు మొదలైందని, జనవరి నుంచి 9,412.50 కోట్లు వసూలు చేస్తారని శోకాలు పెట్టింది. ఈ లెక్కలు నిజమే అయినప్పటికీ... ఈ భారం పిందెవరన్నదే అసలు ప్రశ్న! దీనికి సమాధానం...

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి... 2022లో సెప్టెంబరు 29, డిసెంబరు 22, మార్చి 23, మే 30వ తేదీల్లో మూడు విడతల్లో మొత్తం 8113.60 కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీల కోసం ఈఆర్‌సీకి డిస్కమ్‌లు ప్రతిపాదనలు పంపించాయి. అప్పుడు అధికారంలో ఉన్నది సాక్షాత్తూ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా!

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.12,849 కోట్ల ఎఫ్‌పీసీసీఏ చార్జీల వసూలుకు అనుమతించాలంటూ ఈ ఏడాది మే 24 - 27 తేదీల మధ్య డిస్కమ్‌లు ప్రతిపాదించాయి. ప్పుడూ ముఖ్యమంత్రిగా ఉన్నది వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డే! చంద్రబాబు కాదు!

నిబంధనల ప్రకారం డిస్కమ్‌లు ప్రతిపాదనలు పం పిన 90 రోజుల్లోపు ఈఆర్‌సీ వాటిపై ప్రజాభిప్రాయం సేకరించి నిర్ణయం వెలువరించాలి. కానీ... ఎన్నికల ముందు కొత్త ‘బాదుడు’తో కష్టం తప్పదని కాబోలు, జగన్మోహన్‌ రెడ్డి దీనిని వాయిదా ‘వేయించారు’. అప్పటి ప్రతిపాదనలకు కూటమి సర్కారు వచ్చాక ఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. అంటే... ఇది అక్షరాలా జగన్‌ బాదుడే! కూటమి సర్కారుది కాదు!

ఇది విజయవాడకు చెందిన ఒక వినియోగదారుడి విద్యుత్‌ బిల్లు..

ఇందులో... విద్యుత్‌ వాడకం చార్జీలు రూ.358, ఫిక్స్‌డ్‌ చార్జెస్‌ రూ.20, కస్టమర్‌ చార్జెస్‌ రూ.45, ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.6.72.

వీటిలో కూటమి ప్రభుత్వం కొత్తగా పెంచినవి, వేసిన చార్జీలు లేవు.

ఇక... ట్రూఅప్‌ చార్జీ రూ.21.74, ఎఫ్‌పీపీసీఏ చార్జీ రూ.65.76, మరో ఎఫ్‌పీపీసీఏ చార్జీ 46.80... ఈ మూడు జగన్‌ హయా ంలో ప్రతిపాదించి ఆమోదించి, వసూలు చేయడం మొదలుపెట్టినవే!

ఇప్పుడు చెప్పండి! బిల్లులు భగభగమనిపించింది ఎవరు?

విద్యుత్‌ చార్జీల బాదుడు జగన్‌దే!

సర్దుబాటు పేరుతో వరుసగా పోట్లు

అధికారంలో ఉండగా రకరకాలుగా దెబ్బలు

చివరి రెండేళ్లలో 20వేల కోట్లకు పైగా బాదుడు

ఎన్నికల ముందు వ్యతిరేకత వస్తుందనే భయం..

అప్పుడు నిర్ణయం పెండింగ్‌లో పెట్టిన ఈఆర్‌సీ

కూటమి సర్కారు వచ్చాక వాటికి ఆమోదం

తన హయాంలో పెరిగిన చార్జీలు

ఇప్పుడు తగ్గించాలంటూ జగన్‌ వింత పోకడ

చార్జీలు ఒక్క పైసా పెంచని కూటమి సర్కారు

వచ్చే ఏడాది ‘పోటు’ ఉండదని ఇప్పటికే స్పష్టీకరణ

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

బాదుడు జగన్‌ది.. బాధలు పెట్టింది జగన్‌..

షాకులు ఇచ్చింది జగన్‌... శోకాలు పెడుతున్నదీ జగనే!

‘నేను చార్జీలు పెంచుతా. ఆ చార్జీలను మీరు తగ్గించాలి’ ఇదీ... ఆయన వైఖరి. అధికారంలో ఉండగా జగన్‌ వరుసగా ఐదేళ్లపాటు ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం అమలు చేశారు. ‘చార్జీల పెంపు’ అనే మాట వాడకుండా... ఇంధన సర్దుబాటు, ట్రూ అప్‌ చార్జీల పేరుతో బిల్లులు భగభగమనిపించారు.

గతంలో విద్యుత్‌ చార్జీలు పెంచాల్సి వస్తే... ప్రజలకు చెప్పి పెంచేవారు. కానీ... జగన్‌ వచ్చాక చాపకింద నీరులా, దొంగ దెబ్బలు కొట్టడం మొదలుపెట్టారు. 2019లో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచీ ఇదే తీరు. ‘విద్యుత్‌ చార్జీలు పెంచడం లేదు’ అంటూ వార్షిక వ్యయ నివేదికలను సమర్పించే సమయంలో ఘనంగా ప్రకటించడం... ఆ తర్వాత ట్రూఅప్‌, ఇంధన సర్దుబాటు పేరిట భారం వేయడం! ఇదే రివాజు. ఇలా ట్రూఅప్‌ చార్జీల పేరిట వినియోగదారులపై దొంగ దెబ్బతీయవచ్చన్న ఆలోచన గతంలో ఏ ముఖ్యమంత్రికీ రాలేదు. ట్రూ అప్‌, ఇంధన సర్దుబాటు ప్రతిపాదనలు పరంపర జగన్‌ ఐదేళ్ల పాలనలో కొనసాగుతూ వచ్చింది. 2019-20లో డిస్కమ్‌లు రూ.1788.73 కోట్లకు ఈఆర్‌సీకిప్రతిపాదనలు పంపగా.. ఈఆర్‌సీ ఏకంగా రూ.1851.15 కోట్లకు ఆమోదం తెలిపింది. 2021-22లో రూ.3554.58 కోట్ల మేర ఇంధన సర్దుబాటు చార్జీల ప్రతిపాదనలను డిస్కమ్‌లు చేశాయి. రూ.3082.09 కోట్లకు ఈఆర్‌సీ ఆమోదం తెలిపింది.

jik.jpg


అక్కడా ‘మేనేజ్‌’ చేశారు...

ట్రూఅప్‌ చార్జీల వరుస బాదుడుతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని గ్రహించిన జగన్‌.. పెంపు ప్రతిపాదనలపై ఈఆర్‌సీ వెంటనే ఆమోద ముద్ర వేయకుండా ‘మేనేజ్‌’ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నికల ముందు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సహజంగా డిస్కమ్‌ల ప్రతిపాదనలపై 90 రోజుల్లోనే ఈఆర్‌సీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ... 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకూ ఈఆర్‌సీ 2022-23 ట్రూఅ్‌పపై నిర్ణయం తీసుకోలేదు. అదే సమయంలో... ఈఆర్సీ ఆమోదం లేకుండానే డిస్కమ్‌లు జనం నుంచి చార్జీలు వసూలు చేసి దొంగ దెబ్బ తీశాయి. ఈ భారం రూ.2869 కోట్లు! ఇక జగన్‌ పాలనలో చివరి ఏడాది 2023-24లోనూ ట్రూఅప్‌ చార్జీల ప్రతిపాదనలను ఈఆర్‌సీకి పంపేందుకు డిస్కమ్‌లకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. చివరి ఏట.. ఏకంగా రూ.12,849 కోట్ల బాదుడుకు సిద్ధమయ్యారు. దీనిపైనా.. ఈఆర్‌సీ తన నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టింది. ఎన్నికలు ముగిసి, కూటమి సర్కారు వచ్చాక 2022-23లో రూ.6702 కోట్లకు.. 2023-24లో రూ.9400 కోట్ల వసూలుకు ఆమోదం తెలిపింది. విచిత్రమేంటంటే .. జగన్‌ పాలనలో ఆఖరి ఏట వినియోగదారులకు తెలియకుండా యూనిట్‌కు 40 పైసల చొప్పున ట్రూఅప్‌ చార్జీల భారాన్ని వేశారు. వెరసి... కూటమి సర్కారులో ‘బిల్లులు భగభగమంటున్నాయి’ అని శోకాలు పెడుతున్న రూ.15000 కోట్ల విద్యుత్తు భారమంతా.. జగన్‌ పాలనలోని చివరి రెండు సంవత్సరాల్లో ఆయన ప్రతిపాదించినవే. తన జమానాలో పెంచిన చార్జీలను ఇప్పుడు తగ్గించాలనడమే పెద్ద విచిత్రం!

‘బాదుడే బాదుడు’...

అని 2019 ఎన్నికల్లో ఊరూరా మైకుల్లో హోరెత్తించి మరీ అధికారంలోకి వచ్చారు!

‘పవర్‌’లోకి రాగానే...

ట్రూ అప్‌ చార్జీల పేరిట ఏటేటా షాకుల మీద షాకులు ఇస్తూ బాధలు పెట్టారు!

ఇప్పుడు... అధికారంలో పోగానే ‘బిల్లులు భగభగ’ అంటూ తన రోత పత్రికలో రాతలు రాస్తున్నారు!

అసలు విషయం ఏమిటంటే... షాకులు ఇచ్చిందీ ఆయనే! శోకాలు పెడుతున్నదీ ఆయనే!

ఇదీ... జగన్మాయ!

మరో నిజం ఏమిటంటే... 2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు పెంచలేదు. ఇప్పుడు... కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదికి సంబంధించి ఎలాంటి సర్దుబాటు చార్జీలు ఉండబోవని ఇప్పటికే స్పష్టం చేసింది. వెరసి.. ఇప్పుడు భగభగ మంటున్న బిల్లులకు ఆజ్యం పోసింది... నిప్పు రాజేసింది ఎవరో కాదు! ఆయన... వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి! అదే జగన్మోహన్‌ రెడ్డి ఇప్పుడు విద్యుత్‌ చార్జీలు తగ్గించాలంటూ ధర్నాలు, నిరసనలకు పిలుపునివ్వడం విచిత్రం!

Updated Date - Dec 28 , 2024 | 04:03 AM