Share News

Guntur : ఐఎంఏ అభివృద్ధికి డాక్టర్‌ నరేంద్రరెడ్డి సేవలు ప్రశంసనీయం

ABN , Publish Date - Dec 31 , 2024 | 05:29 AM

ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) అభివృద్ధికి డాక్టర్‌ నరేంద్రరెడ్డి అందించిన సేవలు అభినందనీయమని ఐఎంఏ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ ఆర్‌వీ అశోకన్‌, డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ జే నాయక్‌ ప్రశంసించారు.

 Guntur : ఐఎంఏ అభివృద్ధికి డాక్టర్‌ నరేంద్రరెడ్డి సేవలు ప్రశంసనీయం

  • జాతీయ ఉత్తమ కార్యదర్శి అవార్డు ప్రదానం

గుంటూరు మెడికల్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) అభివృద్ధికి డాక్టర్‌ నరేంద్రరెడ్డి అందించిన సేవలు అభినందనీయమని ఐఎంఏ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ ఆర్‌వీ అశోకన్‌, డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ జే నాయక్‌ ప్రశంసించారు. ఐఎంఏ జాతీయ ఉత్తమ కార్యదర్శిగా సీనియర్‌ జాయింట్‌ రీప్లే్‌సమెంట్‌ సర్జన్‌, సాయిభాస్కర్‌ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్‌ అధినేత డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్నారు. 2023-24 సంవత్సరానికి గాను గుంటూరు ఐఎంఏ బ్రాంచ్‌ను అన్ని విభాగాల్లో ఉత్తమ పని తీరు కనబర్చేలా తీర్చిదిద్దినందుకు ఆయనకు ఈ అవార్డు దక్కింది. హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జరిగిన ఐఎంఏ జాతీయ సమావేశాల్లో భాగంగా శనివారం రాత్రి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌వీ అశోకన్‌, జాతీయ కార్యదర్శి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ జే నాయక్‌ చేతుల మీదుగా ఈ అవార్డును డాక్టర్‌ నరేంద్రరెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా ఐఎంఏ నేతలు బూసిరెడ్డి సేవలను కొనియాడారు. గుంటూరు బ్రాంచ్‌ చరిత్రలో నిలిచిపోయేలా డాక్టర్స్‌ దివాళీ సెలబ్రేషన్స్‌, ఇఫ్తార్‌ విందు, ఆర్‌జీ కర్‌ కాలేజీపై నిరసన కార్యక్రమాలు చక్కగా నిర్వహించారని గుర్తు చేశారు. విజయవాడ వరద బీభత్స సమయంలో డాక్టర్‌ నరేంద్ర రెడ్డి నేతృత్వంలో గుంటూరు బ్రాంచ్‌ అందించిన ఆర్థిక, మౌలిక సేవలు మైలురాలుగా నిలిచిపోతాయని ప్రశంసించారు. డాక్టర్‌ నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ ఐఎంఏ సభ్యుల సహకారంతోనే తాను గుంటూరు బ్రాంచ్‌కు జాతీయస్థాయిలో గుర్తింపు సాధించినట్టు తెలిపారు.

Updated Date - Dec 31 , 2024 | 05:30 AM