AP News: అసెంబ్లీ సమావేశాల వేళ.. ఆగని ఇసుక దందా
ABN , Publish Date - Feb 05 , 2024 | 09:42 AM
Andhrapradesh: రాజధాని ప్రాంతంలో ఇసుక అక్రమ దందా కొనసాగుతోంది. ఓ వైపు అసెంబ్లీలో జరుగుతున్న సమయంలో రాజధాని ప్రాంతంలో అక్రమ ఇసుక దందా కలకలం రేపుతోంది.
అమరావతి, ఫిబ్రవరి 5: రాజధాని ప్రాంతంలో ఇసుక అక్రమ దందా కొనసాగుతోంది. ఓ వైపు అసెంబ్లీలో జరుగుతున్న సమయంలో రాజధాని ప్రాంతంలో అక్రమ ఇసుక దందా కలకలం రేపుతోంది. సీఎం జగన్‌రెడ్డి వెళ్లే మార్గం మందడం రోడ్డులో నిన్న (ఆదివారం) అర్ధరాత్రి ఇసుకలోడ్‌తో వెళ్తున్న లారీ దిగబడిపోయింది. దీంతో అక్రమార్కులు రోడ్డుపైనే ఇసుకను దించేసి లారీతో పరార్ అయ్యారు. ఇసుకలోడు దిగబడిపోవడంతో మందడం గ్రామంలో వాటర్ పైప్‌లైన్ దెబ్బతిన్నది. సీఎం వస్తున్న మార్గం కావడంతో రాత్రికి రాత్రే అధికారులు అక్కడకు చేరుకుని... రిపేరు చేసి వదిలి వెళ్ళిన ఇసుకతోనే గుంటను పూడ్చేశారు. అర్ధరాత్రిలలో అక్రమ ఇసుక తరలించుకుపోతున్నారని అనేక మార్లు రాజధాని రైతులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోని పరిస్థితి. ముఖ్యమంత్రి రాక సందర్భంగా అక్రమ ఇసుక దందా వ్యవహారం మరోసారి బహిర్గతమైంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..