Share News

Srisailam : కిటకిటలాడిన శ్రీగిరి

ABN , Publish Date - Dec 30 , 2024 | 04:51 AM

నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సంవత్సరం ముగింపు రోజులు కావడంతో స్వామి, అమ్మవార్లను

Srisailam : కిటకిటలాడిన శ్రీగిరి

శ్రీశైలం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సంవత్సరం ముగింపు రోజులు కావడంతో స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు వేల సంఖ్యలో క్షేత్రానికి తరలివచ్చారు. వేకువజాము నుంచే స్వామి, అమ్మవార్ల దర్శనార్థం భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. భక్తుల రద్దీతో క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లు, ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. స్వామి, అమ్మవార్ల దర్శనానికి 4 గంటలపైగా సమయం పట్టింది.

Updated Date - Dec 30 , 2024 | 04:52 AM