Srisailam: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద
ABN , Publish Date - Jul 31 , 2024 | 07:43 AM
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో : 3,37,891 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 3,33,066 క్యూసెక్కులకు చేరుకుంది.
నంద్యాల: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో : 3,37,891 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 3,33,066 క్యూసెక్కులకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం : 210.5133 టీఎంసీలకు చేరుకుంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ క్రమంలోనే శ్రీశైలం జలాశయానికి త్రివర్ణ పతాకం రంగులతో విద్యుత్ అలంకరణ చేశారు. ఒకవైపు విద్యుత్ అలంకరణ.. మరోవైపు నీటి విడుదల.. ఈ అందాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలి వస్తున్నారు.
డ్యామ్ గేట్లను త్రివర్ణ పతాకం లైటింగ్‌తో అలంకరించడంతో చూపరులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని విడుదల చేస్తుండటంతో నాగార్జున సాగర్ నీటి మట్టం పెరుగుతోంది. సాగర్‌కు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. సాగర్ ఇన్ ఫ్లో : 2,32,843 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 27, 454 క్యూసెక్కులకు చేరుకుంది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 522.20 అడుగులకు చేరుకుంది. పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం : 312.5050 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం : 153.3180 టీఎంసీలకు చేరుకుంది.
రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 12.10.అడుగులకు నీటిమట్టం తగ్గింది. 175 గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. 10.52 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. అలాగే పోలవరం వద్ద గోదావరి వరద క్రమంగా తగ్గుతోంది. ప్రాజెక్టు అప్పర్ స్పిల్ వే వద్ద 32.560 మీటర్లు, స్పిల్ వే దిగువన 24.150 మీటర్ల నీటి మట్టం ఉంది. స్పిల్ వే నుంచి 9,76,083 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మరోవైపు కడెం ప్రాజెక్టు 1 గేటును ఎత్తి వేసి నీటిని విడుదల చేశారు. మొత్తంగా 4 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 2300 క్యూసెక్కులు కాగా.. పూర్తి సామర్థ్యం 700 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 695.425అడుగులకు చేరుకుంది.
వలంటీర్లపై వ్యాఖ్యల కేసులో పవన్ కల్యాణ్‌కు ఊరట
Read more AP News and Telugu News