Share News

Siddam Sabha: బాపట్ల జిల్లా, మేదరమెట్ల వద్ద నేడు వైసీపీ చివరి సిద్దం సభ

ABN , Publish Date - Mar 10 , 2024 | 08:12 AM

బాపట్ల జిల్లా: భీమిలి, ఏలూరు, రాప్తాడులో సిద్దం సభలు నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివారం బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద సిద్ధం నాల్గవ సభ నిర్వహించనున్నారు. ముందు జరిగిన మూడు సిద్ధం సభలు ప్రజలను ఏమాత్రం ఆకట్టుకోలేదు.

Siddam Sabha: బాపట్ల జిల్లా,  మేదరమెట్ల వద్ద నేడు వైసీపీ చివరి సిద్దం సభ

బాపట్ల జిల్లా: భీమిలి, ఏలూరు, రాప్తాడులో సిద్దం సభలు (Siddam Sabha) నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఆదివారం బాపట్ల జిల్లా (Bapatla Dist.) మేదరమెట్ల వద్ద సిద్ధం నాల్గవ సభ నిర్వహించనున్నారు. ముందు జరిగిన మూడు సిద్ధం సభలు ప్రజలను ఏమాత్రం ఆకట్టుకోలేదు. సీఎం జగన్ ప్రసంగం ప్రారంభం కాకుండానే సభలకు వచ్చిన జనం ఇంటి దారి పడుతున్నారు.

కాగా మేదరమెట్ల వద్ద లక్ష మందికి కూడా ఏర్పాటు చేయకుండా 15 లక్షల మంది వస్తారని వైసీపీ నేతలు ప్రచారం చేయడంపై విమర్శిలు వ్యక్తమవుతున్నాయి. 16వ నెంబరు జాతీయ రహదారి పక్కనే సిద్దం సభ ఏర్పాటు చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు సిద్దం సభకు అధికారులు కేటాయించారు. దీంతో ఆర్టీసీ డిపోలలో బస్సులు లేక ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. సిద్ధం సభల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టడంపై వైసీపీపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 10 , 2024 | 08:15 AM