Share News

Minister Ambati: సంబరాల రాంబాబు.. భోగి వేడుకల్లో మంత్రి డ్యాన్స్..

ABN , Publish Date - Jan 14 , 2024 | 09:36 AM

పల్నాడు జిల్లా: తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలో ప్రతీ పల్లె, పట్టణ ప్రాంతాల్లో భోగి మంటలు వేసి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే భోగి మంటలు వేసి వేడుకల్లో పాల్గొన్నారు.

Minister Ambati: సంబరాల రాంబాబు.. భోగి వేడుకల్లో మంత్రి డ్యాన్స్..

పల్నాడు జిల్లా: తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలో ప్రతీ పల్లె, పట్టణ ప్రాంతాల్లో భోగి మంటలు వేసి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే భోగి మంటలు వేసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో పల్నాడు జిల్లా, సత్తెనపల్లి, గాంధీ బొమ్మల సెంటర్లో మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. భోగి మంటలు వేసి దాని చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేశారు. ఈ వేడుకల్లో స్థానిక కౌన్సిలర్లు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి ‘సంబరాల రాంబాబు.. అంబటి రాంబాబు’ అనే ప్రత్యేక పాటకు స్టెప్పులు వేశారు. కాగా గత ఏడాది మంత్రి చేసిన డ్యాన్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

Updated Date - Jan 14 , 2024 | 09:36 AM