Share News

YSRCP : పోటీ చేసేదే లేదు.. ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానన్న ఎంపీ!

ABN , Publish Date - Jan 06 , 2024 | 07:33 AM

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకి ఈ సారి అదే స్థానం నుంచి టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి నిరాకరించినట్టు సమాచారం. గుంటూరు నుంచి పోటీ చేయాలని లావుకు జగన్ సూచించారట. అయితే గుంటూరు నుంచి తాను పోటీ చేయబోనని శ్రీకృష్ణదేవరాయలు తేల్చి చెప్పారట

YSRCP : పోటీ చేసేదే లేదు.. ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానన్న ఎంపీ!

అమరావతి: నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకి ఈ సారి అదే స్థానం నుంచి టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి నిరాకరించినట్టు సమాచారం. గుంటూరు నుంచి పోటీ చేయాలని లావుకు జగన్ సూచించారట. అయితే గుంటూరు నుంచి తాను పోటీ చేయబోనని శ్రీకృష్ణదేవరాయలు తేల్చి చెప్పారట. నరసరావుపేట టికెట్ లావుకి ఇవ్వాలని లోక్‌సభ పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలు సైతం సీఎంను కోరినప్పటికీ ఫలితం దక్కలేదట. ఇంతమంది చెప్పినా జగన్ వినిపించుకోలేదని టాక్. తాను గుంటూరు నుంచి పోటీ చేయలేనని, ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని సీఎంకు లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేసినట్టు సమాచారం. నరసరావుపేట ఎంపీ టికెట్ బీసీలకు ఇస్తానని సీఎం చెప్పారట. తనకు నరసరావుపేట ఇస్తే పోటీ చేస్తానని లేని పక్షంలో బరి నుంచి తప్పుకుంటానని సీఎంకు లావు శ్రీకృష్ణ దేవరాయలు తేల్చి చెప్పారట.

Updated Date - Jan 06 , 2024 | 10:17 AM