Restaurant: ఆ ప్రముఖ రెస్టారెంట్‌లో ఫుడ్ తింటున్నారా.. బీ కేర్ ఫుల్
ABN , Publish Date - Nov 12 , 2024 | 03:59 PM
గుడివాడలోని టామరిండ్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నాణ్యత పరిమాణాలు అధ్వానంగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు...
కృష్ణా జిల్లా: హోటళ్లు, రెస్టారెంట్‌లో ఫుడ్ పాయిజన్ కారణంగా వినియోగదారులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. వినియోగదారుల ఆరోగ్యం ఏమైతే మాకేంటి అనే రీతిలో కొందరు హోటల్ నిర్వాహకులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. రుచిని పెంచేందుకు ఆకర్షణీయంగా కనిపించేందుకు వంటల్లో ఇష్టారీతిన పదార్థాలు వాడేస్తున్నారు. ఇప్పటికే అధికారులు పలుచోట్ల నోటీసులు జారీ చేసినా హోటల్ నిర్వాహకుల తీరు మాత్రం మారడం లేదు.
నోటీసులు..
తాజాగా, గుడివాడలోని టామరిండ్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నాణ్యత పరిమాణాలు అధ్వానంగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు అనుమానిత కల్తీ ఆహార పదార్థాల శాంపిల్స్ ను సేకరించి రెస్టారెంట్ నిర్వహకులకు నోటీసులు జారీ చేశారు. రెస్టారెంట్ నిర్వాహకులు కనీస పారిశుద్ధ్య నిబంధనలు కూడా పాటించడం లేదని ఫుడ్ కంట్రోలర్ ఎం. శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫిర్యాదులు..
టామరిండ్ రెస్టారెంట్ పై ప్రజల నుండి అనేక ఫిర్యాదులు వచ్చాయని ఈ క్రమంలోనే దాడులు చేశామని వెల్లడించారు. శాంపిల్స్ సేకరించిన ఆహార పదార్థాలను స్టేట్ ఫుడ్ లేబరేటరీకి పరీక్షల నిమిత్తం పంపిస్తామన్నారు. రిపోర్టులు వచ్చిన తర్వాత తదిపరి చర్యలు తీసుకుంటామని ఫుడ్ కంట్రోలర్ ఎం. శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
Also Read:
దుష్ప్రచారం చేస్తే కేసులు పెడతాం.. పురంధేశ్వరి వార్నింగ్
కొడంగల్ ఇష్యూ.. బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ ఎంపీ సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ ఎప్పటికీ ఆ తరగతులను ఎదగనీయదు
For More Telugu and National News