Share News

Ex-Minister Sake Sailajanath : సీమలో రెండో రాజధాని పెట్టాలి

ABN , Publish Date - Dec 02 , 2024 | 05:52 AM

కర్నూలులో ఏర్పాటు చేస్తున్న హైకోర్టును అమరావతికి తీసుకెళ్లి, ఇక్కడ బెంచ్‌ ఏర్పాటు చేస్తామని చెప్పడం సరికాదని, రాయలసీమలో రెండో రాజధాని ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు.

Ex-Minister Sake Sailajanath : సీమలో రెండో రాజధాని పెట్టాలి

  • మాజీ మంత్రి శైలజానాథ్‌ డిమాండ్‌

అనంతపురం న్యూటౌన్‌, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): కర్నూలులో ఏర్పాటు చేస్తున్న హైకోర్టును అమరావతికి తీసుకెళ్లి, ఇక్కడ బెంచ్‌ ఏర్పాటు చేస్తామని చెప్పడం సరికాదని, రాయలసీమలో రెండో రాజధాని ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు. అనంతపురంలో ఆదివారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కర్నూలు నుంచి హైకోర్టును అమరావతికి తరలించి, బెంచ్‌ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. కడప కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించారన్నారు. కడపలో ఉంటే ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు.

Updated Date - Dec 02 , 2024 | 05:52 AM