Share News

Ex Minister Narayana: 15 లోపు ఓటర్ల జాబితా సరిచేయకుంటే కోర్టుకెళతాం..

ABN , Publish Date - Feb 07 , 2024 | 08:50 AM

ఓటర్ల జాబితాలో అక్రమాలనేవి ఏపీలోని ఏదో ఒక జిల్లాకే పరిమితం కాలేదు. వైసీపీ అన్ని జిల్లాల్లోనూ అక్రమాలకు పాల్పడింది. ఇష్టానుసారంగా దొంగ ఓట్లను ఓటర్ల జాబితాలో యాడ్ చేసింది.

Ex Minister Narayana: 15 లోపు ఓటర్ల జాబితా సరిచేయకుంటే కోర్టుకెళతాం..

నెల్లూరు: ఓటర్ల జాబితాలో అక్రమాలనేవి ఏపీలోని ఏదో ఒక జిల్లాకే పరిమితం కాలేదు. వైసీపీ అన్ని జిల్లాల్లోనూ అక్రమాలకు పాల్పడింది. ఇష్టానుసారంగా దొంగ ఓట్లను ఓటర్ల జాబితాలో యాడ్ చేసింది. నెల్లూరు సిటీ కొత్త ఓటర్ల జాబితాల్లోనూ భారీ సంఖ్యలో తప్పిదాలు, దొంగ ఓట్లు వెలుగు చూశాయి. మున్సిపల్ కమిషనర్, అధికారులని దొంగ ఓట్ల విషయమై మాజీ మంత్రి నారాయణ నిలదీశారు. జాబితాలు సరి చేయకుంటే, కోర్టుకి వెళతామని హెచ్చరించడం జరిగింది.

అనంతరం మాజీ మంత్రి నారాయణ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. కొత్త ఓటర్ల జాబితాల్లో 2265 డబుల్ ఓట్లు, 5వేలకి పైగా దొంగ ఓట్లున్నాయన్నారు. మూడు, నాలుగు రోజుల్లో వాటన్నింటినీ సరిచేయాలన్నారు. వైసీపీ నేతల కనుసన్నల్లో బీఎల్వోలు పనిచేస్తున్నారని నారాయణ తెలిపారు. ఈ నెల 15వ తేది లోపు సరిచేయాలని... లేదంటే కోర్టుని ఆశ్రయిస్తామని తెలిపారు. ఎన్నికలు ముగిశాక ఏమీ ఉండదని అధికారులు అనుకోవడం పొరపాటని నారాయణ తెలిపారు.

Updated Date - Feb 07 , 2024 | 08:53 AM