Employees Protest : రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
ABN , Publish Date - Dec 29 , 2024 | 06:08 AM
గాలివీడు ఎంపీడీవో సి.జవహర్‌బాబుపై దాడిని నిరసిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

అమరావతి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): గాలివీడు ఎంపీడీవో సి.జవహర్‌బాబుపై దాడిని నిరసిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. జవహర్‌బాబుకు మద్దతుగా అన్ని మండల, జిల్లా పరిషత్ కార్యాలయాల వద్ద అధికారులు, ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించారు. బాధిత ఎంపీడీవోను డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పరామర్శించడం, చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం ద్వారా ఉద్యోగుల్లోనూ ఆత్మస్థైర్యం నింపారని ఏపీ పంచాయతీరాజ్ గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు కేఎస్ వరప్రసాద్, డి.వెంకట్రావు, జీవీ సూర్యనారాయణ, కేఎన్‌వీ ప్రసాద్, మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఉద్యోగుల జేఏసీ నేత వైవీడీ ప్రసాద్, కార్యదర్శుల సమాఖ్య అధ్యక్షుడు వర్ల శంకర్, డిప్లమో ఇంజనీర్ల అధ్యక్ష, కార్యదర్శులు రవీంద్ర, మహంతి పేర్కొన్నారు.