Share News

YS Sunitha Speech Live Updates: హంతకులెవరు? జగన్ డ్రామాలెందుకు? సునీత సంచలన ప్రెస్‌మీట్..

ABN , First Publish Date - Apr 15 , 2024 | 11:22 AM

YS Sunitha: వైఎస్ వివేకా హత్యకు సంబంధించి ఆయన కుమార్తె వైఎస్ సునీత సంచలన ప్రెస్‌మీట్ పెట్టారు. జగన్‌పై జరిగిన దాడి.. తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

YS Sunitha Speech Live Updates: హంతకులెవరు? జగన్ డ్రామాలెందుకు? సునీత సంచలన ప్రెస్‌మీట్..
YS Sunitha

Live News & Update

  • 2024-04-15T12:44:21+05:30

    న్యాయం కోసం నేను ఎవరితోనైనా మాట్లాడతా: సునీత

    • సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్‌ కోసం అడిగా

    • అపాయింట్‌మెంట్‌ కోసం లేఖ రాసినా స్పందన లేదు

    • విమలమ్మ అన్నపై చూపిన ప్రేమ ఇదేనా?

    • విమలమ్మ చెబుతున్న విషయాలపై స్పష్టత లేదు

    • నేను టీడీపీలో చేరానని విమర్శిస్తున్నారు

  • 2024-04-15T12:30:39+05:30

    న్యాయం కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నా: సునీత

    ఇన్ని సాక్ష్యాలున్నా న్యాయం జరగలేదు

    ప్రజలకు నిజం తెలవడానికే ప్రజల ముందుకు తెచ్చా

    ప్రజా తీర్పు కోసమే ఇవన్నీ ముందుకు తీసుకొస్తున్నా

  • 2024-04-15T12:05:07+05:30

    ఒత్తిళ్ల వల్లే కేసు దర్యాప్తు ముందుకు సాగటం లేదు: సునీత

    • పైస్థాయిలో ఒత్తిళ్ల వల్లే ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగటం లేదు

    • సీబీఐ ఇంకా విచారణ చేయాల్సి ఉంది

    • ఒత్తిడి వల్ల విచారణ ఆపేసినట్లు నేను ఆరోపిస్తున్నా

    • ఇంకా విచారణ జరిపేందుకు చాలా సమాచారం ఉంది

  • 2024-04-15T11:59:49+05:30

    గుండెపోటుగా ప్రచారం చేశారు: సునీత

    • వివేకా హత్యను మొదట సాక్షిలో గుండెపోటుగా ప్రసారం చేశారు

    • వివరాలు వెల్లడిస్తూ భావోద్వేగానికి గురైన వివేకా కుమార్తె సునీత

    • ఐదేళ్ల కింద నాది ఒంటరి పోరాటం

    • తెలుగు రాష్ట్రాలు నా పోరాటానికి మద్దతిస్తున్నాయి

    • మద్దతిస్తున్న ప్రజలందరికీ నా కృతజ్ఞతలు

    • నాకు తెలిసిన విషయాలు మొత్తం ప్రజల ముందు ఉంచా

    • ఇది న్యాయమా అని అడుగుతున్నా

  • 2024-04-15T11:49:58+05:30

    ఎం.వి కృష్ణారెడ్డి వివేకాకు చాలా సన్నిహితుడు: సునీత

    • శివశంకర్‌రెడ్డికి, కృష్ణారెడ్డి మధ్య ఫోన్‌ కాల్స్‌ ఉన్నాయి

    • భాస్కర్‌రెడ్డి ఫోన్‌ డేటా చూస్తే 14 నుంచి 16 ఉదయం వరకు స్విచ్ఛాఫ్‌

    • అవినాశ్‌రెడ్డి మాత్రం వీళ్లెవరో తెలియదని చెబుతున్నారు

  • 2024-04-15T11:39:04+05:30

    సంచలన సీసీ ఫుటేజీ విడుదల..

    • అవినాశ్‌, భాస్కర్‌రెడ్డితో కిరణ్‌ యాదవ్‌ ఉన్న ఫొటోలు చూపిన సునీత

    • గంగిరెడ్డి, అవినాష్ మధ్య పలుమార్లు వాట్సాప్ కాల్స్ మాట్లాడినట్లు ఆధారాలు

    • హత్య తర్వాత ఉమాశంకర్ రెడ్డి పారిపోతున్న ఫుటేజ్‌ని సీబీఐ సేకరించింది

  • 2024-04-15T11:37:56+05:30

    లొకేషన్ అక్కడ చూపించింది..: సునీత

    • మార్చి 14న రాత్రి అవినాష్ ఇంట్లో సునీల్ యాదవ్ లొకేషన్‌ చూపించింది

    • ఉమాశంకర్ రెడ్డి ఇంటికి కూడా హత్యకు ముందు, తర్వాత సునీల్ వెళ్లారు

    • నిందితులంతా అవినాష్ ఇంట్లో ఉన్నట్లు సీబీఐ గుర్తించింది

  • 2024-04-15T11:36:55+05:30

    గజ్జల ఉమాశంకర్‌రెడ్డి కాల్స్ మాట్లాడిన ఆధారాలున్నాయి: సునీత

    • వివేకా హత్యకు మూడు వారాల ముందు దస్తగిరి.. అవినాష్ ఇంటికి వెళ్లిన్నట్లు ఆడియో ఉంది

    • వివేకా హత్య కేసులో నిందితుల నాకు తెలియదని అవినాష్ చెప్పారు

    • కానీ అవినాష్ మాట్లాడిన కాల్స్, ఫొటోలు బయటపెట్టిన సునీత రెడ్డి

  • 2024-04-15T11:35:38+05:30

    షర్మిలకు ఎంపీ సీటు ఇవ్వాలని వివేకా అడిగారు: సునీత

    • వివేకా పేరును ఓటరు జాబితా నుంచి అప్పట్లో తీసివేశారు

    • మొదటి ఛార్జిషీట్‌లో సీబీఐ నలుగురి పేర్లు పెట్టింది

    • A1 ఎర్ర గంగిరెడ్డి, A2 సునీల్‌ యాదవ్‌, A3 ఉమాశంకర్‌రెడ్డి, A4 దస్తగిరి

    • A1 ఎర్ర గంగిరెడ్డితో అవినాశ్‌కు పరిచయం ఉంది

  • 2024-04-15T11:33:24+05:30

    వివేకా హత్య కేసులో సూత్రధారులెవరో వివరిస్తున్న వైఎస్ సునీత..

    • మొదల రిమాండ్‌లో సీబీఐ నలుగురి పేర్లు చెప్పిందన్నారు వైఎస్ సునీత.

    • ఏ-1 ఎర్ర గంగిరెడ్డి, ఏ-2 యాదాటి సునీల్ యాదవ్, ఏ-3 గజ్జల ఉమా శంకర్ రెడ్డి, ఏ-4 దస్తగిరి.

    • అవినాష్‌తో నిందితులకు వ్యక్తిగతంగా సంబంధాలు ఉన్నాయి.

    • సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ యాదవ్. మొత్తం క్లియర్‌‌గా ఉంది.

    • కాల్ డేటా చూస్తే వీరి మధ్య సంబంధాలు తెలుస్తున్నాయి.

  • 2024-04-15T11:20:54+05:30

    YS Sunitha: వైఎస్ వివేకా హత్యకు సంబంధించి ఆయన కుమార్తె వైఎస్ సునీత సంచలన ప్రెస్‌మీట్ పెట్టారు. జగన్‌పై జరిగిన దాడి.. తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.