Share News

AP Election 2024: నేడు ఎన్టీఆర్ జిల్లాలో 18 నామినేషన్లు దాఖలు

ABN , Publish Date - Apr 19 , 2024 | 10:00 PM

ఏపీలో సార్వత్రిక ఎన్నిక (AP Election 2024)ల్లో భాగంగా ఎన్నికల సంఘం (Election Commission) నామినేషన్లను స్వీకరిస్తుంది. ఇందులో భాగంగా జిల్లాలో రెండో రోజు మొత్తం 18 నామినేష‌న్లు దాఖ‌లు అయ్యాయని జిల్లా ఎన్నిక‌ల అధికారి ఎస్‌.ఢిల్లీరావు తెలిపారు. విజ‌య‌వాడ పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గానికి మూడు నామినేష‌న్లు దాఖలు అయినట్లు చెప్పారు.

AP Election 2024: నేడు ఎన్టీఆర్ జిల్లాలో 18 నామినేషన్లు దాఖలు

ఎన్‌టీఆర్ జిల్లా: ఏపీలో సార్వత్రిక ఎన్నిక (AP Election 2024) ల్లో భాగంగా ఎన్నికల సంఘం (Election Commission) నామినేషన్లను స్వీకరిస్తుంది. ఇందులో భాగంగా నేడు (శుక్రవారం) ఎన్టీఆర్ జిల్లాలో రెండో రోజు మొత్తం 18 నామినేష‌న్లు దాఖ‌లు అయ్యాయని జిల్లా ఎన్నిక‌ల అధికారి ఎస్‌.ఢిల్లీరావు తెలిపారు. విజ‌య‌వాడ పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గానికి మూడు నామినేష‌న్లు దాఖలు అయినట్లు చెప్పారు.

7 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు 15 నామినేష‌న్లు దాఖ‌లు చేసినట్లు వివరించారు. విజ‌య‌వాడ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఒక సెట్‌, రిప‌బ్లిక‌న్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన పేరం శివ‌నాగేశ్వరరావు 2 సెట్లు, తెలుగు రాజాధికార స‌మితి పార్టీకి చెందిన బి.శ్రీనివాస‌రావు 2 సెట్ల నామినేష‌న్లు స‌మ‌ర్పించారని తెలిపారు.


YS Sharmila: ఇక్కడ ఫెయిల్ అయిన వ్యక్తి ఇంకో దగ్గర ఎలా పనికొస్తాడు?.. గుమ్మనూరుపై షర్మిల ఫైర్

విజ‌య‌వాడ ప‌శ్చిమ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి 4 నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయ‌ని.. ఇందులో వైఎస్సార్సీపీ నుంచి షేక్ ఆసీఫ్, సీపీఐ పార్టీకి చెందిన జి.కోటేశ్వరరావు, ఎంసీపీఐ (యూ)కి చెందిన ఖ‌దీర్ భాషా షేక్‌, స్వత్రంత అభ్యర్థిగా ర‌త్నావ‌త్ కిశోర్ కుమార్ ఒక్కో సెట్ నామినేష‌న్లు దాఖ‌లు చేశార‌ని వెల్లడించారు.

విజ‌య‌వాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి 4 నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయ‌ని.. ఇందులో స్వతంత్ర అభ్యర్థిగా బొప్పన గాంధీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బోండా ఉమామ‌హేశ్వరరావు, సీపీఎం (మార్క్సిస్ట్‌) అభ్యర్థిగా చిగురుపాటి బాబూరావు, జాతీయ జ‌న‌సేన పార్టీ అభ్యర్థిగా కె.శివ‌శంక‌ర్‌లు ఒక్కో సెట్ నామినేష‌న్లు దాఖ‌లు చేశారని చెప్పారు.


Balakrishna: టీడీపీ - జనసేన - బీజేపీ కూటమిని తట్టుకునే శక్తి ఎవరికీ లేదు

విజ‌య‌వాడ తూర్పు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి 3 నామినేష‌న్లు దాఖ‌లు కాగా ఇందులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా గ‌ద్దె రామ్మోహ‌న్‌, గ‌ద్దె అనూరాధ‌, గ‌ద్దె క్రాంతికుమార్‌లు ఒక్కో సెట్ నామినేష‌న్లు దాఖ‌లు చేశారని వివరించారు. మైల‌వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి 2 నామినేష‌న్లు దాఖ‌లు అయ్యాయని.. ఇందులో స్వతంత్ర అభ్యర్థులుగా వేముల‌ప‌ల్లి పృథ్వీ, వేల్పూరి క‌న‌క‌దుర్గాదేవి ఒక్కో సెట్ నామినేష‌న్లను దాఖ‌లు చేశారని తెలిపారు.

జ‌గ్గయ్యపేట అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి 2 నామినేష‌న్లను స్వీక‌రించామని... ఇందులో ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్ అభ్యర్థిగా క‌ర్నాటి అప్పారావు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాజ‌గోపాల శ్రీరామ్ (తాత‌య్య)లు ఒక్కో సెట్ నామినేష‌న్ దాఖ‌లు చేసిన‌ట్లు జిల్లా ఎన్నిక‌ల అధికారి ఎస్‌.ఢిల్లీరావు తెలిపారు.


ఇవి కూడా చదవండి

AP Elections: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఏర్పాట్లపై ఎస్‌ఈసీకి వర్ల రామయ్య లేఖ

YS Sunitha: నేను ప్రజల ముందుకొస్తే.. వైసీపీ నేతల్లో వణుకు పుట్టి..

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 19 , 2024 | 10:04 PM