Share News

AP Elections: అక్కాచెల్లెళ్లకు నోటీసులు

ABN , Publish Date - May 26 , 2024 | 01:58 AM

నెలలతరబడి జగనన్న విద్యాదీవెన డబ్బు లు తల్లుల ఖాతాల్లో వేయలేదు. బటన్‌ నొక్కి కొన్ని నెలలు గడిచిపోయినా డబ్బులు ఖాతాల్లోకి చేర్చలేదు.

 AP Elections: అక్కాచెల్లెళ్లకు నోటీసులు
jagan

ఎన్నికలు కాగానే బయటపడ్డ జగన్‌ బుద్ధి

కాలేజీ ఫీజు కట్టలేదని తల్లులకు తాఖీదు.. బటన్‌ నొక్కినా ఖాతాల్లో వేయని సర్కారు

నెలల తరబడి తల్లుల ఎదురు చూపు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎగ్గొట్టిన వైనం

మరి సర్కారుకు ఎవరు నోటీసులివ్వాలి?.. వైసీపీ తీరుతో భ్రష్ఠుపట్టిన విద్యాదీవెన

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

నెలలతరబడి జగనన్న విద్యాదీవెన డబ్బు లు తల్లుల ఖాతాల్లో వేయలేదు. బటన్‌ నొక్కి కొన్ని నెలలు గడిచిపోయినా డబ్బులు ఖాతాల్లోకి చేర్చలేదు. కానీ, కాలేజీలకు ఫీజులు చెల్లించలేదంటూ తల్లులకు ప్రభుత్వం నోటీసులు పంపించింది. ‘నా అక్కచెల్లెళ్లు...’ అంటూ ఎన్నికల ప్రచార సభల్లో ఊదరగొట్టిన జగన్‌, ఎన్నికలు కాగానే వారికి నిజ రూప దర్శనం చూపించారు. వైసీపీ సర్కారు వచ్చినప్పటి నుంచి అసంబద్ధ నిర్ణయాలతో అన్నీ వర్గాలను ఇబ్బంది పెట్టింది. గతంలో కళాశాలలకు ప్రభుత్వమే నేరుగా ఫీజులు చెల్లించే విధానం అమల్లో ఉండేది. తామేదో కొత్తదనం చూపించాలంటూ తల్లుల ఖాతాల్లో ఫీజులు జమ చేస్తామని ఆర్భాటం చేసింది. అయితే ఫీజు మొత్తం ఒకేసారి తల్లులు ఖాతాల్లో వేయకుండా నాలుగు విడతలు చేసి ప్రతి మూడు నెలలకోసారి వేస్తామని షెడ్యూల్‌ ప్రకటించింది. కానీ, ఆ షెడ్యూల్‌ను కూడా అనుసరించలేదు. ఎప్పుడంటే అప్పుడు తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యాదీవెన మొత్తం పడటంతో సకాలంలో విద్యార్థులు కళాశాలల్లో ఫీజులు చెల్లించలేని పరిస్థితి. జగన్‌ బటన్‌ నొక్కినా...నెల, రెండు నెలల తర్వాత ఖాతాల్లో జమ అవుతున్నాయి. దీంతో తల్లిదండ్రులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి కళాశాలలకు సకాలంలో ఫీజులు చెల్లిస్తున్నారు. ఆ వడ్డీల భారంతోనే కుంగిపోయిన తల్లులకు ఇప్పుడు సర్కారు నుంచి నోటీసులు అందుతున్నాయి. జగనన్న విద్యాదీవెన కింద తల్లుల ఖాతాల్లో పడిన నిధులను కళాశాలల్లో చెల్లించలేదని సచివాలయాల ద్వారా నోటీసులు జారీచేస్తున్నారు. ఉత్తుత్తి బటన్‌ నొక్కి విద్యార్థుల తల్లులను మోసం చేసిన సర్కార్‌కు ఎవరు నోటీసులివ్వాలని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జగన్‌ హయాంలో...

ఏడాదిలో విద్యార్థి చెల్లించాల్సిన ఫీజులను నాలుగు విడతలుగా విభజించారు. ప్రతి విడత కళాశాలల ఖాతాల్లో కాకుండా విద్యార్థి తల్లి ఖాతాలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జమ చేస్తున్నారు. ఫీజుల విషయంలో ప్రభుత్వానికి, కళాశాలలకు ఎలాంటి లావాదేవీలు లేకుండాచేశారు. తమ ఖాతాల్లో పడే డబ్బులను తీసుకెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులే కళాశాలల్లో ఫీజు కింద చెల్లించాలి. ప్రభుత్వం విద్యార్థుల ఖాతాల్లో ఏ విడత అయినా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జమచేయకపోతే, తల్లిదండ్రులు అప్పోసప్పో చేసి ఆ విడత ఫీజులు కట్టుకోవాల్సిందే. లేకపోతే వారి పిల్లలు చదివేందుకు కళాశాలలు అనుమతించవు. జగన్‌ సర్కార్‌ గత నాలుగేళ్లలో మూడు విడతల ఫీజు తల్లుల ఖాతాల్లో జమచేయలేదు. దీంతో ఆ భారం తల్లిదండ్రులపై పడింది. పీజీ కళాశాలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిలిపేయడంతోపాటు వారికి ఇవ్వాల్సిన బకాయిలు కూడా నిలిపేశారు. దీంతో వారి వద్ద లక్షమంది విద్యార్థుల సర్టిఫికెట్లు బీరువాల్లో ఉన్నాయి. దీంతో విద్యార్థులు భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారిపోయింది.


వసతి దీవెన ఏటా ఒక విడతే...

హాస్టల్‌ ఖర్చుల కోసం ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఏటా రూ.20 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు జమచేస్తామంటూ జగనన్న విద్యావసతి దీవెన పథకాన్ని అమల్లోకి తెచ్చారు. రెండు విడతలుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు విడుదల చేసిన పోస్టుమెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ నిధులను సైతం ప్రభుత్వం వాడుకుంటోంది. అయితే ఏ సంవత్సరం కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు విద్యావసతి దీవెనను అమలు చేయలేదు. ఏటా ఒక విడత మాత్రమే తల్లుల ఖాతాల్లో వసతి దీవెన జమ అవుతోంది. అంటే ఇంజనీరింగ్‌ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.7500, ఐటీఐ విద్యార్థులకు రూ.5 వేలు మాత్రమే జమ చేస్తున్నారు. ఈ ఏడాది అయితే ఒక విడత కూడా జమ చేయలేదు. దీంతో ఇంజనీరింగ్‌ విద్యార్థులు చాలీచాలని వసతిదీవెనతో హాస్టల్‌ ఫీజు కోసం అప్పులు చేయాల్సి వస్తోంది.

గతంలో..

వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాం నుంచీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అనేది కళాశాలలు, ప్రభుత్వాల మధ్య వ్యవహారం మాత్రమే. దానితో విద్యార్థులకు, తల్లులకు నేరుగా ఎటువంటి సంబంధం లేదు. ప్రభుత్వం కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోతే కళాశాలలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసేవి. కళాశాలల్లో చదివే విద్యార్థుల జోలికి మాత్రం యాజమాన్యం వెళ్లేది కాదు. విద్యార్థుల చదువులకూ ఆటంకం ఉండేది కాదు.

రాజకీయ లబ్ధి కోసమే..

రాజకీయ ప్రయోజనాల కోసమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో డీబీటీ పద్ధతిని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. తల్లుల ఖాతాల్లో జమచేయడం వల్ల జగన్‌ వాళ్ల పిల్లల ఫీజు చెల్లిస్తున్నారన్న కృతజ్ఞత చూ పుతారని వైసీపీ భావించింది. అయితే ఫీజు సకాలంలో చెల్లించి ఉంటే వారు అనుకున్న లక్ష్యం నెరవేరేదేమో?.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పెట్టడం, కళాశాలల యాజమాన్యం తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచడంతో ప్రభుత్వంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. సవ్యంగా సాగుతున్న ఫీజు రీయింబర్స్‌మెం ట్‌ విఽ దానంపై లేనిపోని ప్రయోగాలు చేసి తమను ఇ బ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. కళాశాలల ఒత్తిడితో పిల్లల ఫీజుల కోసం తాము అప్పులపాలు అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 26 , 2024 | 12:37 PM