Share News

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 20 , 2024 | 12:18 PM

కాకినాడ: వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. మత్స్యకారులను అవమానించేలా ద్వారంపూడి మాట్లాడారంటూ మత్స్యకార సంఘాలు, టీడీపీ నేతలు మండిపడ్డారు. కోటి రూపాయలతో గుడి కడితే రూ. 10 కోట్లు వసూలు చేసే జాతి మీది అంటూ మాజీ ఎమ్మెల్యే కొండబాబును ద్వారంపూడి దూషించారు...

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి వివాదాస్పద వ్యాఖ్యలు

కాకినాడ: వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి (Dwarampudi Chandrasekhar Reddy) వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. మత్స్యకారులను అవమానించేలా ద్వారంపూడి మాట్లాడారంటూ మత్స్యకార సంఘాలు, టీడీపీ నేతలు మండిపడ్డారు. కోటి రూపాయలతో గుడి కడితే రూ. 10 కోట్లు వసూలు చేసే జాతి మీది అంటూ మాజీ ఎమ్మెల్యే కొండబాబు (Ex MLA Kondababu)ను ద్వారంపూడి దూషించారు. ఈ వ్యాఖ్యలపై సామాజిక వర్గ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ద్వారంపూడి ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని మత్స్యకారులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతామని హెచ్చరించారు.

వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ద్వారంపూడికి వ్యతిరేకంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి మత్స్యకార సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘రూ. కోటితో గుడి కడితే రూ. 10 కోట్లు వసూలు చేసే జాతి, కుటుంబం నీది.. నీలా ప్రజల దగ్గర విరాళాలు తీసుకుని నేను ఆలయం కట్టలేదు’ అని రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే కొండబాబును ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో తమను అవమానించారంటూ సామాజికవర్గం భగ్గుమంటొంది. మత్స్యకార జాతిని అవమానించేలా ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని మత్స్యకార సంఘాల నేతలు అన్నారు. మత్స్యకారుల ఓట్లతో గెలిచిన ఆయన ఈ విధంగా మాట్లాడడం సరికాదని అన్నారు. తక్షణం ద్వారంపూడి క్షమాపణ చెప్పకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని మత్స్యకార సంఘాల నేతలు హెచ్చరించారు.

Updated Date - Feb 20 , 2024 | 12:38 PM