పగటి పూట రెక్కీ ... ఇంట్లో ఎవరూ లేకపోతే చోరీ!
ABN , Publish Date - Dec 29 , 2024 | 01:04 AM
కాకినాడ క్రైం, డిసెంబరు 28 (ఆంధ్ర జ్యోతి): గుట్టు చప్పుడుగా పగటి పూట రెక్కీ నిర్వహిస్తాడు. ఇంట్లో ఎవరూ లేరని తెలిసిన మరుక్షణం ఆ ఇంటిని కొల్లగొట్టి ఉన్నకాడికి దోచుకుంటాడు. నిండా రెండు పదుల వయస్సు లేని ఆ యువకుడు గతేడాదిగా పోలీసులకు చిక్కకుండా యదేఛ్చగా చోరీలు చేస్తూ చివరికి కాకినాడ పోలీసులకు దొరికిపోయాడు. నిందితుడి నుంచి రూ.11,16,840 విలువైన 129 గ్రాముల బంగారు ఆభరణాలు, 560 గ్రాముల వెండి వస్తువులు

చోరీ కేసుల్లో నిందితుడు.. కాకినాడలో అరెస్ట్
రూ.11.16 లక్షల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం
కాకినాడ క్రైం, డిసెంబరు 28 (ఆంధ్ర జ్యోతి): గుట్టు చప్పుడుగా పగటి పూట రెక్కీ నిర్వహిస్తాడు. ఇంట్లో ఎవరూ లేరని తెలిసిన మరుక్షణం ఆ ఇంటిని కొల్లగొట్టి ఉన్నకాడికి దోచుకుంటాడు. నిండా రెండు పదుల వయస్సు లేని ఆ యువకుడు గతేడాదిగా పోలీసులకు చిక్కకుండా యదేఛ్చగా చోరీలు చేస్తూ చివరికి కాకినాడ పోలీసులకు దొరికిపోయాడు. నిందితుడి నుంచి రూ.11,16,840 విలువైన 129 గ్రాముల బంగారు ఆభరణాలు, 560 గ్రాముల వెండి వస్తువులు, రూ.1,50,000 నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ త్రీటౌన్ సెంట్రల్ క్రైం పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో శనివారం విలేకర్ల సమావేశంలో ఇన్‌చార్జి డీఎస్పీ ఆర్.రామచంద్రరావ్ నిం దితుడి వివరాలు వెల్లడించారు. ఇటీవల కాకినా డ టౌన్, రూరల్ పరిసర ప్రాంతాల్లో పగటిపూట దొంగతనాలు అధికం కావడంతో ఎస్పీ విక్రాంత్‌పాటిల్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన ఆదే శాల మేరకు అడ్మిన్ ఎస్పీ ఎంజెవి భాస్కరరావ్ పర్యవేక్షణలో డీఎస్పీ రామచంద్రరావ్ నేతృత్వం లో సీసీఎస్ సీఐ వి.కృష్ణ, వన్‌టౌన్ ఇన్స్‌పెక్టర్ ఎం.నాగదుర్గారావ్‌ల బృందం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బందికి స్థానిక ఎస్‌ఆర్ ఎంటీ పార్శిల్ ఆఫీస్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ యువకుడు తారసపడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా కాకినాడ పర్లోపేట రాజీవ్‌గృహకల్ప అపార్ట్‌మెంట్స్ కు చెందిన సుంకర తేజగా తెలిపాడు. స్థానిక పీఆర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వి తీయ సంవత్సరం చదువుతూ జల్సాలకు మరిగాడు. ఈ నేపథ్యంలో సులువుగా డబ్బులు సం పాదించాలని దొంగతనాలను ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఏడాదిగా వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు నేరాలు, ఇంద్రపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు నేరాలు, ట్రీటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకటి, సర్పవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక నేరానికి పాల్పడిన ట్లు అంగీకరించాడని డీఎస్పీ తెలిపారు. అతడి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ వినయ్‌ప్రతాప్, క్రైం డిటెక్టివ్ ఏఎస్‌ఐ కొప్పిశెట్టి గోవిందరావ్, ఏఎస్‌ఐ ధనరాజ్, హె చ్‌సీలు ప్రసాద్, వర్మ, పీసీలు ఈశ్వరరావ్, నా యుడులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.