రాక్షస పాలన సంకెళ్ల నుంచి విముక్తికి కృషి

ABN, Publish Date - May 16 , 2024 | 12:17 AM

కార్పొరేషన్‌ (కాకినాడ), మే 15: రాక్షస పాలన సంకెళ్ల నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి నిరంతరం కృషి చేస్తానని కాకినాడ ఎంపీ కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ అన్నారు. ఎన్నికల రోజు ఇతర రాష్ట్రాల నుంచి సైతం తరలివచ్చి భారత ప్రధాని నరేంద్రమోదీ, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, టీడీపీ అధినేత చంద్రబాబు ఆశీ స్సులతో కాకినాడ ఎంపీగా పోటీచేసిన తనపై అంతులేని ప్రేమ చూపించి ఓట్ల వర్షం కురిపించిన జిల్లా ప్రజలకు శిరస్సు వంచి పాదాభివం

కాకినాడ ఎంపీ కూటమి అభ్యర్థి తంగెళ్ల

కార్పొరేషన్‌ (కాకినాడ), మే 15: రాక్షస పాలన సంకెళ్ల నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి నిరంతరం కృషి చేస్తానని కాకినాడ ఎంపీ కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ అన్నారు. ఎన్నికల రోజు ఇతర రాష్ట్రాల నుంచి సైతం తరలివచ్చి భారత ప్రధాని నరేంద్రమోదీ, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, టీడీపీ అధినేత చంద్రబాబు ఆశీ స్సులతో కాకినాడ ఎంపీగా పోటీచేసిన తనపై అంతులేని ప్రేమ చూపించి ఓట్ల వర్షం కురిపించిన జిల్లా ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్నారు. ఈ మహాయజ్ఙంలో అహర్నిశలు శ్రమించి, కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరికీ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Updated at - May 16 , 2024 | 12:17 AM