Share News

Ramakrishna: అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడాన్ని ఖండించిన రామకృష్ణ

ABN , Publish Date - Jan 06 , 2024 | 03:23 PM

Andhrapradesh: అంగన్వాడీలపై ఎస్మాచట్టాన్ని ప్రయోగించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలి రాజకీయాల్లో నిమగ్నమయ్యారన్నారు.

Ramakrishna: అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడాన్ని ఖండించిన రామకృష్ణ

అమరావతి: అంగన్వాడీలపై ఎస్మాచట్టాన్ని ప్రయోగించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలి రాజకీయాల్లో నిమగ్నమయ్యారన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ఎమ్మెల్యేల స్థానాలు మార్చినంత మాత్రాన గెలవటం అసాధ్యమన్నారు. ప్రజాతంత్ర వాదులంతా ప్రభుత్వ చర్యలను ఖండించాలని కోరుతున్నామని రామకృష్ణ పేర్కొన్నారు.


కాగా.. సమస్యల పరిష్కారం కోసం గత 26 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై (Anganwadi Strike) జగన్ సర్కార్ (AP Government) ఉక్కుపాదం మోపింది. అంగన్వాడీల సమ్మెపై సర్కార్ ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిని అత్యవసర సర్వీసు కిందకు తీసుకొస్తూ జీవో జారీ చేసింది. ఆరు నెలలు పాటు సమ్మె నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీల సేవలు అత్యవసర సర్వీసులు కిందకు రానప్పటికీ... వారిని అత్యవసర సర్వీసుల కిందకు ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ మేరకు జీవో నంబర్ 2ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 06 , 2024 | 03:28 PM