Share News

TDP: చంద్రబాబు భారీ బహిరంగ సభ.. బల నిరూపణకు టీడీపీ నేతల పోటాపోటీ

ABN , Publish Date - Jan 03 , 2024 | 02:53 PM

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భారీ బహిరంగ సభ నేపథ్యంలో తిరువూరులో రాజకీయం హీటేక్కింది. తిరువూరులో రానున్న సాధారణ ఎన్నికలు నేపథ్యంలో టీడీపీ నేతల మధ్య రాజకీయం హీటేక్కింది.

TDP: చంద్రబాబు భారీ బహిరంగ సభ.. బల నిరూపణకు టీడీపీ నేతల పోటాపోటీ

తిరువూరు: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భారీ బహిరంగ సభ నేపథ్యంలో తిరువూరులో రాజకీయం హీటేక్కింది. తిరువూరులో రానున్న సాధారణ ఎన్నికలు నేపథ్యంలో టీడీపీ నేతల మధ్య రాజకీయం హీటేక్కింది. చంద్రబాబు బహిరంగ సభ విజయవంతం చేసే నిమిత్తం తిరువూరు నియోజకవర్గం కేంద్రంలో టీడీపీ పార్టీ ఎన్టీఆర్ జిల్లా సమన్వయ కమిటీ, నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశానికి రానున్న ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు నెట్టం రఘురామ్, నక్క ఆనంద్ బాబు, దేవినేని ఉమా, కేశినేని చిన్ని, నాని, టీడీపీ ముఖ్య నేతలు రానున్నారు.

తిరువూరులో ఈ నెల 7న జరగనున్న 'రా... కదలి రా'.. చంద్రబాబు భారీ బహిరంగ సభ నేపథ్యంలో టీడీపీ నేతల మధ్య పోటాపోటీ బల నిరూపణ ర్యాలీలు జరగనున్నాయి. విజయవాడ నుంచి భారీ కార్లతో ర్యాలీగా కేశినేని చిన్ని అనుచరగణం తిరువూరు వస్తున్నారు. తిరువూరు నియోజకవర్గం సరిహద్దు నుంచి బైక్, కార్లతో ర్యాలీగా టీడీపీ పార్టీ కార్యాలయం వరకు కేశినేని నాని అనుచరులు రానున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, చిన్ని ల వర్గా నేతలు తిరువూరు రానున్న నేపథ్యంలో తిరువూరు ఇరువురు నేతలు భారీ ర్యాలీతో రానున్నారు. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి తమ నేతకే అంటే తమ నేతకే అని ఇరువురు నేతల అనుచర గణం హడావుడి చేస్తున్నారు.

Updated Date - Jan 03 , 2024 | 03:14 PM