Share News

Chandrababu: చంద్రబాబు న్యూ లుక్.. అదిరిపోయింది

ABN , Publish Date - Apr 07 , 2024 | 08:01 PM

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం కొత్త లుక్‌లో కనిపించారు. ప్రజాగళం యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా పామర్రులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నల్ల కళ్లద్దాలు ధరించి.. ప్రజలకు అభివాదం చేశారు. అయితే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఆయన ఈ నల్ల కళ్లద్దాలు ధరించినట్లు తెలుస్తోంది.

Chandrababu: చంద్రబాబు న్యూ లుక్.. అదిరిపోయింది

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం కొత్త లుక్‌లో కనిపించారు. ప్రజాగళం యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా పామర్రులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నల్ల కళ్లద్దాలు ధరించి.. ప్రజలకు అభివాదం చేశారు. అయితే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఆయన ఈ నల్ల కళ్లద్దాలు ధరించినట్లు తెలుస్తోంది.

అందుకు సంబంధించిన వీడియోను ఎక్స్‌‌లో తెలుగుదేశం పార్టీ పోస్ట్ చేసింది. బాస్ ఆఫ్ ఏపీ.. ఎవర్ గ్రీన్ హీరో అంటూ క్యాప్షన్ సైతం పెట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో పోస్ట్ చేసిన గంటలోనే వ్యూస్ అంతకంతకు పెరుగుతోంది. అలాగే లైకులు, కామెంట్స్ సైతం వెల్లువెత్తుతున్నాయి.

ఈ వైయస్ జగన్ పాలనలో రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో ప్రజలకు వివరిస్తున్నారు. అందులోభాగంగా ప్రజాగళం యాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పామర్రు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు.

జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న ప్రతి దారుణాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సోదాహరణగా వివరించారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రహదారులపై ఉన్న గుంతలు పూడ్చలేడు కానీ.. మూడు రాజధానులు నిర్మిస్తానని సీఎం వైయస్ జగన్ ప్రగల్బాలు పలుకుతున్నాడని మండిపడ్డారు.


ఈ జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న ప్రతి అంశాన్ని ఆయన సోదాహరణగా వివరించారు. రాష్ట్రంలో వైయస్ జగన్ విధ్వంసం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి చెంది ఉంటే... ఈ ప్రాంత రూపు రేఖలన్నీ మారిపోయేవని చెప్పారు. దీంతో ప్రజల జీవితాలతోపాటు వారి బిడ్డల భవిష్యత్తు బంగారంలా ఉండేదన్నారు. వరుసగా రెండో సారి తాను ముఖ్యమంత్రి అయి ఉంటే.. అమరావతి దేశంలోనే నెంబర్ వన్‌ స్థానంలో ఉండేదని తెలిపారు. మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు వచ్చేవని చెప్పారు.

రాజధాని అమరావతి కోసం రైతులు వేలాది ఎకరాల భూములు ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వేల కోట్ల ఆదాయం సైతం సమకూరేదని.. కానీ ఈ దుర్మార్గుడు.. అమరావతికి ద్రోహం చేశాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే.. రాజధాని నిర్మాణం పూర్తవుతుందని.. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ సైతం పూర్తవుతుందని ఆయన హామీ ఇచ్చారు. అలాగే రైతులను ఆదుకుంటామని.. నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాలు చేపడతామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.


అయితే 2019 ఎన్నికల్లో నాటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ అధికారంలోకి వస్తే.. ఏం చేస్తాడో.. ముందే ఉహించిన చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు చెప్పిన మాటలనే అమలు చేయడం కొసమెరపు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే... రాజధాని తరలిస్తారు తమ్ముళ్లు అంటూ చంద్రబాబు నాడే స్పష్టం చేశారు. జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత మూడు రాజధానుల ప్రకటన చేయడం ద్వారా అదే జరిగిందన్నది సుస్పష్టం.

ఇక అమరావతిని శ్మశానంతో పోల్చడమే కాకుండా.. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళనకు దిగితే.. వారిని పెయిడ్ ఆర్టిస్టులంటూ వైసీపీ నాయకులు అభివర్ణించారు. ఈ జగన్ పాలనా చీడను ఆంధ్రప్రదేశ్ నుంచి పారద్రోలేందుకు నారా చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారు. ఆ క్రమంలో ఆయన వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు తాజాగా ప్రజాగళం యాత్ర చేపట్టారు. మరోవైపు వైయస్ జగన్‌ను గద్దెదించేందుకు బీజేపీ, జనసేనతో టీడీపీ కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్తుంది. ఈ ఎన్నికల్లో ఈ కూటమిదే అధికారమని ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేసిన విషయం విధితమే.

Updated Date - Apr 07 , 2024 | 08:28 PM