Share News

NTR - Bharat Ratna: ఎన్టీఆర్‌కు భారతరత్న?.. నేడు కీలక నిర్ణయం!

ABN , Publish Date - Mar 13 , 2024 | 01:09 PM

తెలుగు ప్రజల ఆరాధ్యదైవం స్వర్గీయ నందమూరి తారక రామారావుకు (NTR) భారతరత్న అవార్డు అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న కేంద్ర కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.

NTR - Bharat Ratna: ఎన్టీఆర్‌కు భారతరత్న?.. నేడు కీలక నిర్ణయం!

తెలుగు ప్రజల ఆరాధ్యదైవం స్వర్గీయ నందమూరి తారక రామారావుకు (NTR) భారతరత్న అవార్డు అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న కేంద్ర కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ఈ భేటీ ఇప్పటికే మొదలైంది. ఈ నెల 15న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

కాగా ఎన్టీఆర్‌కు భారత రత్న అవార్డు ప్రకటించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఈ అంశంపై కేంద్రానికి ఇప్పటికే చాలా విజ్ఞప్తులు అందాయి. సామాన్య పౌరులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

Mudragada: వైసీపీలో చేరడానికి ముందే ముద్రగడకు మరో అవమానం

AP News: 2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల జాబితా రద్దు: ఏపీ హైకోర్ట్

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 13 , 2024 | 01:47 PM